Elections: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ జాతర..ఇవాళ్టి నుంచే నమోదు

తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ , అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈరోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలవనుంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 25 వరకు నామినేషన్లను తీసుకోనున్నారు.

New Update
Elections: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ జాతర..ఇవాళ్టి నుంచే నమోదు

Nominations Starts Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో ఎన్నికల ప్రక్రియ ఈరోజు షురూ అవుతోంది. ముందుగా ఈరోజు ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించనున్నారు. ఏపీలో 25 ఎంపీ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు.. తెలంగాణలో 17 ఎంపీ, కంటోన్మెంట్‌ అసెంబ్లీ సీటుకి నామినేషన్లను తీసుకోనున్నారు. ఈ నెల 25 వరకు నామినేషన్లకు అవకాశం ఇచ్చారు. ఇవాళ మంచి రోజు కావడంతో నామినేషన్ల ప్రక్రియను మొదలుపెడుతున్నారు.

ఇక తొలిరోజే కీలకనేతలు నామినేషన్లు వేయబోతున్నారు. ఈ నెల 22, 25 తేదీలు మంచి రోజులు కావడంతో... ఆ రోజుల్లోనూ ఎక్కువ నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ఈరోజు మంగళగిరి నుంచి నారా లోకేష్, విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి, భీమిలి - గంటా శ్రీనివాస్ , విశాఖ ఎంపీ - కేఏ పాల్‌, పుట్టపర్తి : టిడిపి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి, ఎమ్మిగనూరు-వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక, శ్రీశైలం-టిడిపి అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి, శ్రీశైలం -వైసిపి అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి, ఎమ్మిగనూరు-టిడిపి అభ్యర్థి బీబీ జయ నాగేశ్వరరెడ్డి, గోపాలపురం : టీడీపీ అభ్యర్థి మద్దిపాటి నామినేషన్లు వేయనున్నారు.

ప్రతి రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. పార్లమెంట్ స్థానాలకు కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాలకు ఆయా నియోజకవర్గ ప్రధాన ఆఫీసుల్లో నామినేషన్లను తీసుకొంటారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే ఆర్వో కార్యాలయం లోపలికి అనుమతి లభించనుంది. అలాగే నామినేషన్ వేసే అభ్యర్థుల ఊరేగింపుతో పాటు దాఖలు చేసే ప్రాంతంలో పూర్తిగా వీడియో రికార్డింగ్ చేయాలి. ఇక నానినేషన్ల స్వీకరణ అయిపోయిన తర్వాత ఈనెల 26 నుంచి పరిశీలన ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఉపసంహరించుకోవాలంటే అది ఈ నె 29లోపు చేసుకోవచ్చును.

ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్‌ జరగనుంది. అసెంబ్లీ, లోక్‌సభ నెండు ఎన్నికలకూ ఆదే రోజు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక కౌంటింగ్ జూన్ 4న చేయనున్నారు. దేశ వ్యాప్తంగా అదే రోజు తుది ఫలితాలు వెలవడనున్నాయి. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లోని 96 ఎంపీ సీట్లకు 4వ దశ నోటిఫికేషన్‌ విడుదల అయింది. 4వ విడతలో ఏపీ, తెలంగాణ, ఒడిశా, యపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, బీహార్‌, జార్ఖండ్‌, ఢిల్లీలలో ఎన్నికలు జరగనున్నాయి.

Also Read:Breaking: సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల!

Advertisment
Advertisment
తాజా కథనాలు