NEET: మళ్లీ అవసరం లేదు.. నీట్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

నీట్‌ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీకోర్టు తీర్పునిచ్చింది. హుజారీబాగ్‌, పాట్నాలో మాత్రమే పేపర్ లీకైందని.. దీనివల్ల 155 మందికి మాత్రమే లబ్ధి చేకూరిందని తెలిపింది. దేశమంతా పేపర్ లీకైనట్లు ఆధారాలు లేవని చెప్పింది.లబ్ధి పొందినవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

New Update
NEET: మళ్లీ అవసరం లేదు.. నీట్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Supreme Count on NEET Scam: నీట్‌ పరీక్షపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నీట్‌ పరీక్షను మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని చీఫ్‌ జస్టీస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో ధర్మాసనం తేల్చిచెప్పింది. కాపీ కొట్టిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హుజారీబాగ్‌, పాట్నాలో మాత్రమే పేపర్ లీకైందని పేర్కొంది. పేపర్‌ లీక్ వల్ల 155 మందికి మాత్రమే లబ్ధి చేకూరిందని తెలిపింది. దేశమంతా పేపర్‌ లీకైనట్లు (Paper Leak) ఆధారాలు లేవని చెప్పింది. నీట్‌ పరీక్షను మళ్లీ నిర్వహిస్తే 24 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుందని పేర్కొంది.

Also Read: తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు.. కేంద్రంపై రేవంత్ అసహనం!

ఇదిలాఉండగా ఇటీవల నీట్‌ పరీక్ష పేపర్‌ లీకవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) పలువురిని అరెస్టు చేసింది. అయితే పేపర్‌ లీక్‌ కావడంతో.. మళ్లీ నీట్‌ పరీక్ష నిర్వహించాలని పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు మళ్లీ పరీక్ష నిర్వహిస్తే తాము నష్టపోతామని.. పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదని కొందరు విద్యార్థులు కూడా పిటిషన్ వేశారు. దీంతో ఈ పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు విచారించింది. చివరికి నీట్‌ పరీక్షను రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని సంచలన తీర్పునిచ్చింది.


Also Read:పేదల మేలు కోసమే పథకాలు ప్రవేశపెట్టాం: నిర్మలమ్మ!

ఈ ఏడాది మే 5న నీట్‌ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 571 నగరాల్లో 4,750 సెంటర్లలో నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 23 లక్షల 33 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత 67 మందికి 720 కి 720 మార్కులు రావడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరికి నీట్‌ లీకైన వ్యవహారం బయటపడటం దేశవ్యాప్తంగా దుమారం రేపింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు