Hero Nithiin : షూటింగ్‌ లో గాయపడిన హీరో నితిన్‌..చిత్రీకరణ ఆపేసిన చిత్ర బృందం!

టాలీవుడ్ హీరో నితిన్‌ షూటింగ్ లో గాయపడినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం నితిన్‌ తమ్ముడు అనే సినిమాను ఏపీలోని మారేడుమిల్లిలో చిత్రీకరిస్తున్నారు. యాక్షన్‌ సన్నివేశాలు చేస్తుండగా నితిన్‌ చేతికి గాయాలు కాగా డాక్టర్లు మూడు వారాల రెస్ట్‌ తీసుకోవాలని చెప్పారు.

New Update
Hero Nithiin : షూటింగ్‌ లో గాయపడిన హీరో నితిన్‌..చిత్రీకరణ ఆపేసిన చిత్ర బృందం!

Nithiin : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌(Nithiin)  షూటింగ్ లో గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం నితిన్‌ తమ్ముడు(Tammudu) అనే టైటిల్‌ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ కోసం డైరెక్టర్‌ వేణు శ్రీరామ్‌(Venu Sriram), చిత్ర బృందం అంతా కలిసి ఏపీలోని మారేడుమిల్లికి వచ్చారు. అక్కడ భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

నితిన్‌ కు గాయాలు..

ఈ క్రమంలో హీరో నితిన్‌ కు గాయాలు అయినట్లు సమాచారం. దాంతో వెంటనే షూటింగ్‌ని నిలిపివేసి.. నితిన్‌ ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. యాక్షన్‌ సన్నివేశాలు కావడంతో నితిన్‌ చేతికి బలమైన గాయాలు అయ్యాయి. నితిన్‌ ని పరిశీలించిన వైద్యులు కనీసం మూడు వారాల పాటు రెస్ట్‌ తీసుకోవాలని తెలిపినట్లు చిత్ర బృందం వెల్లడించింది.

ఆశలన్నీ తమ్ముడు మీదనే..

ఈ సినిమాను దిల్‌ రాజు(Dil Raju) నిర్మిస్తున్నారు. గతేడాది నితిన్‌ కి చెప్పుకోదగ్గ సినిమాలేవి లేవు. డిసెంబర్‌ లో ఎక్స్‌ ట్రా(Extra) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో నితిన్‌ ఆశలన్నీ ప్రస్తుతం తమ్ముడు సినిమా మీదనే ఉన్నాయి.

ఏకంగా పవన్‌ టైటిల్‌ తోనే..

డైరెక్టర్‌ వేణు శ్రీరామ్‌(Venu Sriram) కూడా ఎలాగైనా హిట్‌ కొట్టాలనే ఉద్దేశంతో సినిమాను షూట్‌ చేస్తున్నారు. హీరో నితిన్‌ పవన్‌ కల్యాణ్‌ కు ఎంత వీరాభిమానినో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ప్రతి సినిమాలో కూడా పవన్‌ పేరును వాడకుండా ఉండాడు. అలాంటిది ఈసారి ఏకంగా పవన్‌ టైటిల్‌ తోనే సినిమాను తీస్తున్నాడు.

అక్కా తమ్ముడి నేపథ్యంలో సినిమా ఉండనుందని సినీ వర్గాల టాక్‌. అందుకే తమ్ముడు టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.. ఆ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Also read: చలికాలం రూమ్‌ హీటర్‌ని ఎక్కువగా వాడుతున్నారా..అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Arjun Son Of Vyjayanthi Trailer: కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

కళ్యాణ్ రామ్ కొత్త సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ అత్యంత ఉత్కంఠభరింతగా ఉంది. యాక్షన్, రొమాన్స్, సాంగ్స్ ఇలా ప్రతి విషయంలోనూ కట్ చేసిన ట్రైలర్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరిస్తుంది.

New Update
Arjun Son Of Vyjayanthi Trailer | Nandamuri Kalyan Ram | Vijayashanti

Arjun Son Of Vyjayanthi Trailer | Nandamuri Kalyan Ram

నందమూరి కల్యాణ్‌రామ్‌, విజయశాంతి తల్లీకొడుకులుగా నటించిన కొత్త సినిమా ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’. సయీ మంజ్రేకర్‌ ఇందులో హీరోయిన్‌‌గా నటిస్తోంది. కొత్త దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో మేకర్స్ అదిరిపోయే సర్ ప్రైజ్ అందించారు.

ట్రైలర్ అదుర్స్

ఇవాళ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా ట్రైలర్‌ విడుదల చేశారు. ఫుల్ యాక్షన్‌ సన్నివేశాలతో ఈ ట్రైలర్ అదిరిపోయింది. టైటిల్‌కు తగ్గట్లుగా తల్లీకొడుకుల అనుబంధానికి ఎంతో ప్రాధాన్యమున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి. 

(Arjun Son Of Vyjayanthi)

Advertisment
Advertisment
Advertisment