Rameshwaram Cafe Blast : రామేశ్వరం కేఫ్‌ బ్లాస్ట్.. కేంద్రం కీలక నిర్ణయం

ఇటీవల బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగిన ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై తాజాగా కేసు నమోదు చేసిన ఎన్‌ఐఏ దర్యాప్తుకు సిద్ధమైంది.

New Update
Rameshwaram Cafe Blast : రామేశ్వరం కేఫ్‌ బ్లాస్ట్.. కేంద్రం కీలక నిర్ణయం

Rameshwaram : ఇటీవల కర్ణాటక(Karnataka) లోని బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌ పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కు అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పేలుడు ఘటనపై ఎన్‌ఐఏ తాజాగా కేసు నమోదు చేసింది. దీంతో దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధమైంది. అయితే గత శుక్రవారం (మార్చి 1)వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంటకు బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌లో ఒక్కసారిగా పేలుడు జరిగింది.

Also Read : మరోసారి ఉద్యమం ఉద్ధృతం చేయనున్న రైతులు..

క్లారిటీ ఇచ్చిన సీఎం సిద్ధరామయ్య

మొదటగా గ్యాస్‌ సిలిండర్‌ పేలిందేమోనని అందరు అనుకున్నారు. కానీ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ కేఫ్‌లో బ్యాగ్‌ పెట్టాడని.. అందులో నుంచే పేలుడు సంభవించినట్లు కర్ణాటక సర్కార్‌ నిర్ధారించింది. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Karnataka CM Siddaramaiah) తెలిపారు. ఓ వ్యక్తి కేఫ్‌లో బ్యాగు పెట్టి వెళ్లిపోవడం.. సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు పేర్కొన్నారు. ఆ బ్యాగులో ఐఈడీ(IED) ఉండటం వల్లే పేలుళ్లు జరిగినట్లు చెప్పారు.

ఉగ్రవాదుల కుట్రేనా..!

అయితే ఈ పేలుడు ప్రభావానికి 9 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. పేలుడు జరిగిన వెంటనే భయంతో.. హోటల్‌ సిబ్బంది, కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. అక్కడికి చేరుకున్న బాంబు స్క్వాడ్‌, క్లూస్ టీం అధికారులు ఆ పేలుడుకు సంబంధించి ఆధారాలను సేకరించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ బాంబు పేలుడు వెనుకు ఉగ్రవాదుల కుట్ర ఉందని పలువులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎన్‌ఐఏ దీనిపై దర్యాప్తు జరపనుంది. ఇక త్వరలోనే ఈ ఘటనకు కారకులు ఎవరూ అనే విషయాలు ఎన్‌ఐఏ వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

Also Read : భార్య, కూతుళ్లను గొడ్డలితో నరికిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం చేశాడంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు