/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/new1-jpg.webp)
ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టిన పార్లమెంట్ కొత్త భవనం ఓపెనింగ్ కు రెడీ అయిపోయింది. ఈనెల 18 నుంచి 22 వరకు దీనిలో ప్రత్యేక సమావేవాలను నిర్వహించనున్నారు. దీని తాఊలకా అజెండాను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. మొదటి రోజు 18న పాత పార్లమెంటులోనే సమావేశాలు మొదలవుతాయి. ఈరోజు సంవిధాన్ సభ నుంచి 75 ఏళ్ళ భారత పార్లమెంటరీ ప్రస్థానం మీద చర్చ చేస్తారు. భారత్ తాలూకా అనుభవాలు, జ్ఞాపకాలను ఇందులో చర్చించనున్నారు.
ఇక రెండవరోజు 19వ తేదీన సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనానికి షిఫ్ట్ అవుతాయి. ఆ రోజు వినాయకచవితి కావడంతో, మంచిరోజును పురస్కరించుకుని కొత్త భవనంలో సమావేశాలు మొదలుపెడుతున్నట్లు సమాచారం. 19 నుంచి 22 వరకు రాజ్యసభలో మూడు, లోక్ సభలో నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన అజెండాలో పేర్కొన్నారు. అయితే బిల్లుల చర్చ జాబితా ప్రస్తుతానికి తాత్కాలికమే అని...అవసరమయితే మరికొన్ని బిల్లులను కూడా ప్రవేశపెడతామని తెలిపింది. వీటిల్లో రాజ్యసభ ఆమోదించి లోక్ సభలో పెండింగ్ లో ఉన్న బిల్లులు అడ్వకేట్స్ బిల్లు, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు గురించి చర్చిస్తారు. అలాగే రాజ్యసభలో ప్రవేశపెట్టి, స్టాండింగ్ కమిటీకి పంపని మరో రెండు బిల్లులు దిపోస్టాఫీస్ బిల్లు, ది ఛీఫ్ ఎలక్షన్ కమీషనర్స్(అప్పాయింట్ మెంట్, కండీషన్స్ ఆఫ్ సర్వీస్, అండ్ టెర్మ్ ఆఫీస్) బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు.
అయితే ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో.. జమిలి ఎన్నికలు, దేశం పేరు మార్పు, మహిళా బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి లాంటి
కీలక బిల్లులను గురించి మాత్రం ప్రభుత్వం అజెండాలో ఏమీ చెప్పలేదు. కేంద్రం వ్యూహాత్మకంగానే కావాలనే ఈ అంశాల ప్రస్తావన అజెండాలో తీసుకురావడంలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రహస్య అజెండాలో భాగంగానే సాధరణ బిల్లులను మాత్రమే అజెండాలో చేర్చారని అంటున్నారు. సాధారణ సమావేశాల్లో కూడా ఆమోదం పొందే అవకాశం ఉన్న బిల్లుల కోసం ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయడం ఏంటని అడుగుతున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇటీవల ఇండియా పేరును భారత్‌గా మార్చడం, జమిలి ఎన్నికల అంశాలను తెరపైకి తీసుకొచ్చిన కేంద్రం సెషన్స్ లో వాటి గురించి చర్చిస్తారో లేదో చెప్పకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇక పార్లమెంటు సమావేశాలకు సరిగ్గా ఒక్కరోజు ముందు అంటే 17వ తేదీన ఆల్ పార్టీ ఫ్లోర్ల లీడర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసింది కేంద్రం. దీని కోసం అన్ని పార్టీల సభా పక్ష నేతలకు సమాచారాన్ని పంపింది.
Danam Nagender : కేసీఆర్ వరంగల్ సభ సక్సెస్ అవుతుంది.. దానం సంచలన కామెంట్స్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారని అన్నారు. మరోవైపు ఐపీఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ సబబే అని వెల్లడించారు.
danam nagender brs
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారని అన్నారు. ఎప్పటినుండో కేసీఆర్ ను చూడ్డానికి జనం ఆశగా ఉన్నారని.. సభకు కూడా జనం బాగా వస్తారని తాను కూడా అనుకుంటున్నాని తెలిపారు. హిమాయత్ నగర్ కార్పొరేటర్ గడ్డం మహాలక్ష్మి రామన్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నారాయణగూడ కమ్యూనిటీ హల్ లో జలమండలి, ఇతర అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఐపీఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ సబబే అని దానం వెల్లడించారు.
Also read : పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!
వ్యక్తిగతంగా బాధించింది
అయితే రాష్ట్ర సీఎస్ శాంతకుమారిపై సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం తనను వ్యక్తిగతంగా బాధించిందన్నారు. శాంతకుమారికి మంచి అధికారిగా పేరు ఉందన్నారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తోందని వెల్లడించారు. కాగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కేసీఆర్‌పై దానం అనుకూలంగా కామెంట్స్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. మళ్లీ దానం బీఆర్ఎస్‌లోకి వెళ్తారంటూ పోలిటికల్ సర్కిల్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన దానం ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Also Read : ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!
🔴Pahalgam Terrorist Attack Live Updates: కశ్మీర్ లో ఉగ్రవాదుల వేట.. లైవ్ అప్డేట్స్!
Rohit Sharma Highlights: రోహిత్ శర్మ వీరబాదుడు.. 12 నిమిషాల హైలైట్స్ చూశారా?
Pakistan : సింధు నదిలోప్రతీ నీటి చుక్కా మాదే: పాకిస్తాన్ సంచలన ప్రకటన
సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటి..? త్రివిధ దళాల మెరుపు దాడుల్లో వీళ్లే మునగాళ్లు
Hansika క్షుద్రపూజలు, ఆత్మలు.. ఏడాది తర్వాత ఓటీటీలో హన్సిక హర్రర్ థ్రిల్లర్!