Delhi: రెండేళ్ల చిన్నారిని ఢీకొట్టిన కారు..బాలుడి మృతి..ఢిల్లీలో దారుణ ఘటన! మంగళవారం ఢిల్లీలోని ముఖర్జీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్యన్ అనే రెండున్నరేళ్ల చిన్నారిని కారు ఢీకొట్టింది. చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. By Bhavana 08 Feb 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Delhi Crime: మంగళవారం ఢిల్లీలోని ముఖర్జీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండున్నరేళ్ల చిన్నారిని కారు ఢీకొట్టింది. చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.నార్త్-వెస్ట్రన్ జిల్లా పోలీసు డిప్యూటీ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం...ముఖర్జీ నగర్ లోని ఆటం లేన్ ప్రాంతంలో మెహక్ బన్సాల్ అనే వ్యక్తి ఇంటిని నిర్మిస్తున్నాడు. ఆ ఇంటికి సమీపంలో సునీల్ కుమార్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం సునీల్ కుమారుడు ఆర్యన్ బయట వీధిలో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో బన్సాల్ కారులో బయటకు వెళ్లేందుకు సిద్దమయ్యాడు. ఇంటి బయట ఆడుకుంటున్న ఆర్యన్ ను బన్సాల్ కారుతో బలంగా ఢీకొట్టాడు. दिल्ली के मुखर्जी नगर में एक कार ने ढाई साल के बच्चे को कुचल दिया.#DelhiNews pic.twitter.com/XM62DfO4SS — Shyamji Tiwari (@M_ShyamJi) February 7, 2024 దీంతో కారు కింద పడి చిన్నారి మృతి చెందాడు. విషయాన్ని గమనించిన సునీల్ అతని భార్య పరుగుపరుగున వచ్చి చూడగా కారు కింద కుమారుడు ఆర్యన్ రక్తపు మడుగులో కనిపించాడు. ప్రమాదం జరిగిన వెంటనే బన్సాల్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా సునీల్ దంపతులు ఆర్యన్ ను ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలని వేడుకున్నారు. దీంతో బన్సాల్ తన కారులోనే ఆసుపత్రి వరకు తీసుకుని వెళ్లాడు. వారు ఆసుపత్రిలోనికి రాగానే నిందితుడు బన్సాల్ కారును అక్కడే వదిలేసి పారిపోయాడు. బాలుడ్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ప్రమాదం మొత్తం సీసీ టీవీ కెమెరాల్లో రికార్డైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెహక్ ను సంప్రదించడానికి చాలా సార్లు ప్రయత్నించారు. కానీ అతను వారికి ఫోన్ కు సమాధానం ఇవ్వలేదు. దీంతో నిందితుని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. Also read: ‘ప్రధాని మోడీ ఓబీసీ కాదు, తెలి కులంలో పుట్టాడు’ : రాహుల్ గాంధీ! #viral #accident #car #delhi #boy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి