సూపర్ స్టార్ మహేష్ ని కూడా కలిసిన నెట్‌ఫ్లిక్స్ సీఈవో!

గురువారం హైదరాబాద్‌ నగరానికి వచ్చిన నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ వరుస పెట్టి టాలీవుడ్‌ ప్రముఖులందర్ని కలుస్తున్నారు. గురువారం ఆయన మెగాస్టార్ ఇంటికి వెళ్లగా..శుక్రవారం నందమూరి కంపౌండ్‌ లో విందు చేశారు. తాజాగా ఆయన సూపర్‌ స్టార్‌ మహేశ్‌ని కలిశారు.

New Update
సూపర్ స్టార్ మహేష్ ని కూడా కలిసిన నెట్‌ఫ్లిక్స్ సీఈవో!

Netflix CEO Met Mahesh Babu: నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్‌ సరండోస్ (Ted Sarandos) హైదరాబాద్ కి వచ్చినప్పటి నుంచి కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. క్షణం తీరిక లేకుండా టాలీవుడ్‌ బడా హీరోలందరినీ కూడా కలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ముందు మెగా కంపౌడ్‌ లో అడుగుపెట్టి చిరంజీవి (Chiranjeevi) , చరణ్‌ తో పాటు సాయి ధరమ్‌ తేజ్‌, వైష్ణవ్ తేజ్ లను కూడా కలిశారు.

ఆ తరువాత నందమూరి ఇంటికి వెళ్లి అక్కడ ఎన్టీఆర్ తో ఆయన అన్నయ్య నందమూరి కల్యాణ్‌ రామ్‌, డైరెక్టర్ కొరటాల శివలను కలిశారు. అసలు ఆయనెందుకు హీరోలను కలుస్తున్నారు అనేది టాలీవుడ్‌ లో పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఈ క్రమంలోనే ఆయన తాజాగా సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ని కూడా కలిశారు.

శనివారం నాడు గుంటూరు కారం (Guntur Kaaram)  సినిమా సెట్లో టెడ్‌ మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ ని కలిశారు. మహేష్‌ తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్‌ చేయడంతో అది కాస్త వైరల్‌ గా మారింది. నెట్‌ ఫ్లిక్స్ సీఈవో టెడ్‌ సరండోస్‌ తో పాటు ఆయన బృందం మోనికా షెర్గిల్‌, అభిషేక్‌ గోరాడియాలతో ఫ్యూచర్ ఎంటర్‌టైన్‌మెంట్ కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను మాట్లాడుకున్నాం అని పోస్ట్‌ చేశారు.

దీంతో ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ మీటింగ్స్ అన్ని ప్రస్తుతం హట్ టాపిక్‌ గా మారాయి. వరుస పెట్టి అగ్ర హీరోలను కలవడంతో పాటు వారితో లంచ్‌ లో కూడా పాల్గొంటుంది నెట్‌ ఫ్లిక్స్ బృందం. ఇలా చేయడంతో నెట్‌ ఫ్లిక్స్ టాలీవుడ్ లో ఏదైనా గట్టిగా ప్లాన్ చేస్తుందా? లేదా మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారా? లేక పోతే నెట్‌ ఫ్లిక్స్ లో టాలీవుడ్‌ స్టార్స్ తో ఏదైనా సిరీస్ ప్లాన్ చేస్తున్నారా? అనే సందేహాలు కూడా ఉన్నాయి.

ప్రస్తుతానికి వీరితో ఆపుతారా లేక ఇంకా ఎవర్నైనా కలుస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి నెట్ ఫ్లిక్స్ CEO టెడ్ సరండోస్ టాలీవుడ్ మీటింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారాయి.

Also Read: నాకు ఆయన చాలా ప్రత్యేకమైన వ్యక్తి అంటున్న హీరోయిన్‌..ఇంతకీ ఎవరంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు