NEET Scam : నీట్‌ పేపర్ లీకైనా.. అతడికి తక్కువ మార్కులు !

నీట్‌ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా దుమారం రేపుతుండగా.. అనురాగ్ యాదవ్‌ తనకు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని చెప్పడం సంచలనం రేపింది. తన అంకుల్ ఇచ్చిన పేపర్.. పరీక్షలో వచ్చిన పేపర్ మ్యాచ్ అయ్యిందని తెలిపాడు. అయినప్పటికీ అతడికి 720 మార్కులకు185 మార్కులే రావడం గమనార్హం.

New Update
NEET Scam : నీట్‌ పేపర్ లీకైనా.. అతడికి తక్కువ మార్కులు !

NEET Paper Leak : నీట్‌ (NEET) పేపర్ లీక్‌ పై దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. పరీక్షను రద్దు చేస్తారా లేదా జరిగిన అవకతవకతలను సరిచేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే బిహార్‌ (Bihar) కు చెందిన అనురాగ్ యాదవ్(22) అనే విద్యార్థి.. పరీక్షకు ముందు తనవద్దకు నీట్‌ పేపర్ వచ్చినట్లు పోలీసులకు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న తన అంకుల్ సికిందర్ యాదవేందు నుంచి క్వశ్చన్‌ పేపర్‌ను, ఆన్సర్‌ షీట్‌ పొందానని.. రాత్రంతా వాటిని బట్టిపట్టానని తెలిపాడు. ఆయన ఇచ్చిన క్వశ్చన్ పేపర్‌... అసలు పరీక్షలో ఇచ్చిన క్వశ్చన్‌ పేపర్‌కు మ్యాచ్‌ అయ్యిందని పేర్కొన్నాడు.

Also read: ఘోర రోడ్డు ప్రమాదం..బస్సు బోల్తా..నలుగురి మృతి..ఇంకా!

అయితే అనురాగ్‌ వద్దకు లీకైన పేపర్‌ వచ్చినప్పటి కూడా అతడికి పరీక్షలో మార్కులు మాత్రం చాలా తక్కువగా వచ్చాయి. మొత్తం 720 మార్కులకు 185 మార్కులు వచ్చాయి. ఫిజిక్స్‌లో 85.8 శాతం, బయాలజీలో 51 శాతం మార్కులు రాగా.. కెమిస్ట్రీలో మాత్రం కేవలం 5 శాతం మార్కులే వచ్చాయి. అనురాగ్‌ వద్ద క్వశ్చన్ పేపర్, ఆన్సర్ పేపర్ ఉన్నప్పటికీ అతడికి ఇలా తక్కువగా మార్కులు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. అతడికి ఆన్సర్‌లను గుర్తుంచుకునేందుకు సమయం సరిపోలేదని తెలుస్తోంది. అమిత్‌ ఆనంద్, నితీష్‌ కుమార్‌లతో కలిపి నలుగురు విద్యార్థులతో తాను కనెక్ట్ అయ్యానని సికిందర్ యాదవేందు పోలీసులకు తెలిపారు. నీట్ పేపర్ కోసం ఒక్కో విద్యార్థి రూ.30-32 లక్షలు ఇచ్చారని తెలిపాడు. అంతేకాదు అతడు అత్యాశతో నీట్‌ పేపర్ ధరను రూ.40 లక్షలకు కూడా పెంచినట్లు తెలుస్తోంది. అనురాగ్ ఈ కేసలో అరెస్టయినప్పటికూ.. మిగతా ముగ్గురు విద్యార్థులను కూడా పోలీసులు విచారించారు. వీళ్లలో కూడా ఒకరికి 720 మార్కులకు 300 మార్కులు మాత్రమే రావడం అనుమానాలు రేపుతోంది.

Also Read: సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. బెయిల్ రద్దు!

మరోవైపు అసలు నీట్ పేపర్ లీకే జరగలేదని.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) చెబుతున్నప్పటికీ.. అనురాగ్ యాదవ్, ఇతరులు తమకు క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యిందని చెప్పడం సంచలనం రేపుతోంది. దీంతో నీట్ పరీక్ష సమగ్రతపై విద్యార్థులు, తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ పరీక్షను రద్దు చేయాలని కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. నీట్ వ్యవహారంపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్షలో జరిగిన తప్పులు నిర్దిష్ట ప్రాంతాలకే పరిమితమని.. ఉత్తీర్ణత సాధించిన లక్షలాది మందిపై ప్రభావం ఉండదని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్టిలో రాజీపడేది లేదని.. తప్పు చేసిన వారని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు