Uttarakhnad:నిలువుగా డ్రిల్లింగ్ మొదలు..నెలఖారుకు కార్మికులు బయటకు వచ్చే ఛాన్స్ ఉత్తరాఖండ్ లో సిల్ క్యారా టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకూ శిథిలాల నుంచి సమాంతరంగా చేసిన డ్రిల్లింగ్ పనులను ఇప్పుడు నిట్టనిలువుగా చేస్తున్నారు. టన్నెల్ పైనున్న కొండ మీద నుంచి కిందకు తవ్వుతున్నారు. By Manogna alamuru 27 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఉత్తరాఖండ్ సిల్ క్యారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకుని ఇప్పటికి 14పైన రోజులు గడుస్తోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్మికులను బయటకు తీసుకురాలేకపోయారు. ఇప్పటి వరకు శిథిలాలను తవ్వి వారిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ అది సాధ్యపడలేదు. దాంతో ఇప్పుడు టన్నెల్ మీద ఉన్న కొండ మీద నుంచి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి నిట్టనిలువుగా డ్రిల్లింగ్ చేయడం మొదలుపెట్టారు. మొత్తం 86 మీటర్లలో 20 మీటర్లకు పైగా డ్రిల్లింగ్ చేశారు. భారీ బండలు లాంటివి అడ్డుపడకపోతే నవంబర్ 30వ తేదీకల్లా డ్రిల్లింగ్ పూర్తి అయ్యే అవకాశ ముంది. 85 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేశాక సొరంగం పైకప్పుకు చేసిన కాంక్రీట్, ఉక్కు రాడ్ల నిర్మాణాన్ని పగులగొట్టి మార్గం ఏర్పరచాలని ఎన్‌డీఎంఏ సభ్యుడు మాజీ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నాయిన్ చెప్పారు. Also Read:ముగుస్తున్న ఎక్సైజ్ పాలసీ గడువు.. తక్కువ ధరలకు మద్యం అమ్మితే రూ.4 లక్షలు జరిమానా ఎన్డీఎంఏ ఇప్పటికి ఆరు రకాల రెస్క్యూ ప్లాన్ లను అమలు చేసింది. దాదాపు 62 మీటర్ల దూరం సొరంగం కూలిందని చెప్పారు. ప్రస్తుతం 47 మీటర్ల వరకూ శిథిలాలను తవ్వగలిగారు కానీ తరువాత చాలా కష్టం అయిపోయింది. కూలినభాగంలోని కాంక్రీట్ నిర్మాణ రాడ్లు.. డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను ముక్కలుచేశాయి. దాంతో 47 మీటర్లవరకు ఉన్న మెషీన్‌ను వెనక్కి లాగాం. 15 మీటర్లు లాగాక మెషీన్ విరిగిపోయి ముక్కలు లోపలే ఉండిపోయాయి. ఇవి తొలగిస్తే కానీ కార్మికులను చేరుకోవడానికి కుదరదు. అప్పుడు కూడా ఇంకా 15 మీటర్లు మెషీన్లతో కాకుండా మనుషులు తవ్వుకుంటూ వెళ్ళాలి. ప్రస్తుతం ప్లాస్మా, గ్యాస్ కట్టర్‌లతో ముక్కలను విడివిడిగా కట్‌చేసి బయటకు తీస్తున్నారు. 23 మీటర్లవరకు ముక్కలను తొలగించారు. ఇవి మొత్తం క్లియర్ చేయడానికి ఒక రోజు పట్టొచ్చని అంచనా. అవి తీయడం అయ్యాక అదే మార్గంలో భారత సైన్యంలోని మద్రాస్ యూనిట్ ఇంజనీర్లు, ట్రెంచ్‌లెస్ ఇంజనీరింగ్ సంస్థల సంయుక్త బృందం మ్యాన్యువల్‌గా తవ్వడం మొదలుపెడుతుంది. లోపల చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తెచ్చేందుకు బయట నుంచి సహాయక సిబ్బంది చాలా కష్టపడుతున్నారు. డ్యూటీల వారీగా ఎవరో ఒకరు అక్కడ పని చేస్తూనే ఉన్నారు. #uttarakhand #workers #tunnel #drilling #rescue #ndma మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి