/rtv/media/media_files/2025/03/08/m4jjFTTw35ZazkwQd0t2.jpg)
Maharashtra minister Gulabrao Patil
మహిళా దినోత్సవం సందర్భంగా.. మహారాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత గులాబ్‌రావ్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు బయటికి వెళ్లిప్పుడు పర్సులో లిప్‌స్టిక్‌తో పాటు ఆత్మరక్షణ కోసం కత్తి, కారం పొడి వంటివి కూడా తీసుకెళ్లాలని సూచించారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా జల్‌గావ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల సాధికారత కోసం తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
Also Read: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం.. ఎంతకు కొన్నాడు..? ఆ దేశం ప్రత్యేకత ఏంటో తెలుసా?
'' ప్రస్తుతం మనం మహిళా సాధికారణపై మాట్లాడుకుంటున్నాం. కానీ ఇప్పటికీ ఎక్కడో ఓ చోట చేదు ఘటను ఇంకా జరుగుతూనే ఉన్నాయి. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే గతంలో మహిళలకు లిప్స్టిక్తో పాటు కత్తిని కూడా వెంట తీసుకెళ్లాలని సూచించారు. కానీ అప్పుడు ఆయనపై మీడియాలో విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పటికీ కూడా అదే పరిస్థితి నెలకొంది. ఆత్మరక్షణ కోసం మహిళలకు లిప్స్టిక్తో పాటు కత్తి, కారం పొడిని వెంట పెట్టుకొని వెళ్లాలని సూచిస్తున్నాని'' మంత్రి గులాబ్ రావ్ సూచనలు చేశారు.
Also read: మగాళ్లను మర్డర్ చేసే అవకాశం ఇవ్వండి.. రాష్ట్రపతికి మహిళా నేత సంచలన లేఖ!
అలాగే మహిళల సంక్షేమం కోసం లాడ్కీ బహిణ్ యోజన, MSRTCలో టికెట్ ధరలు తగ్గించడం, ఉచితంగా విద్య అందించడం లాంటి కార్యక్రమాలు మహయుతీ ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. అలాగే ఇటీవల మహిళలపై జరిగిన పలు నేరాలపై కూడా గులాబ్ రావ్ మాట్లాడారు. ఇటీవల పుణెలోని బస్‌డిపోలో 2 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను ప్రస్తావిస్తూ ఆయన మహిళలకు స్వీయరక్షణ సూచనలు చేశారు.
Also Read: ఎలన్ మస్క్‌ను రంగంలోకి దింపిన ట్రంప్.. సునీతా విలియమ్స్ తీసుకొచ్చే డేట్ ఫిక్స్!