/rtv/media/media_files/2026/03/29/women-saw-higher-wage-growth-than-men-across-all-job-types-in-2025-2026-03-29-16-11-59.jpg)
Women saw higher wage growth than men across all job types in 2025
భారత్‌లో పురుషుల కన్నా మహిళల వేతనాలే వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ 'పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) 2025' రిపోర్టును విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. 2024తో పోలిస్తే 2025లో వేతన జీవుల విభాగంలో మహిళల ఆదాయం 7.2 శాతం, స్వయం ఉపాధి పొందుతున్న వాళ్లలో 8.8 శాతం, క్యాజువల్ లేబర్ విభాగంలో 5.4 శాతం పెరిగింది. ఈ క్రమంలోనే పురుషుల జీతాలు వేతన జీవుల విభాగంలో 5.8 శాతం, స్వయం ఉపాధిలో 8 శాతం మేర పెరిగింది. ఇక క్యాజువల్ లేబర్ విభాగంలో మాత్రం 0.2 శాతం స్వల్ప తగ్గిపోయింది.
Also Read: టీవీకే అభ్యర్థుల లిస్టు విడుదల.. రెండుచోట్ల నుంచి బరిలోకి విజయ్
ఆదాయ అసమానతలు
వేతనాలు పెరుగుతున్నప్పటికీ.. పురుషులతో పోలిస్తే మహిళలకు వస్తున్న వేతనాలు ఇంకా తక్కువగానే ఉన్నాయి. వేతన జీవులైన మహిళలు పురుషుల సంపాదనలో కేవలం 76 శాతం మాత్రమే పొందుతున్నారు. క్యాజువల్ లేబర్ విభాగంలో ఇది 69 శాతంగా ఉంది. ముఖ్యంగా స్వయం ఉపాధి రంగంలో ఈ తేడా చాలా ఉంది. ఇక్కడ పురుషులు సంపాదించే ప్రతి రూ.100లకు మహిళలు కేవలం రూ.36 రూపాయలు మాత్రమే పొందుతున్నారు. ఆదాయ అసమానతలు తగ్గించడం కోసం ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి.
మహిళలు క్వాలిటీ ఉద్యోగాల వైపు వెళ్తున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. వేతన జీవుల విభాగంలో మహిళల శాతం 2024లో 16.6 శాతం ఉండగా..2025లో 18.2 శాతానికి పెరిగింది. మరోవైపు దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు కూడా తగ్గుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 2.4 శాతం ఉండగా.. పట్టణాల్లో 4.8 శాతానికి చేరింది.15-29 ఏళ్ల యువకుల్లో నిరుద్యోగ రేటు 9.9 శాతం తగ్గింది. కానీ యువతుల నిరుద్యోగ రేటు మాత్రం స్వల్పంగా 11.3 శాతానికి పెరిగింది.
Also Read: మిడిల్ ఈస్ట్ టెన్షన్: రంగంలోకి దిగిన మోదీ..సౌదీ ప్రిన్స్‌తో ఫోన్ కాల్
ఇదిలాఉండగా అసంఘటిత రంగంలో (Informal Sector) చూసుకుంటే వేతనాల వృద్ధి తగ్గిపోయింది. 2023-24లో 13 శాతంగా ఉన్న వేతన వృద్ధి.. 2025లో కేవలం 3.9 శాతానికే పరిమితమైంది. ఉద్యోగాల కల్పన కూడా గతంతో పోల్చిచూస్తే తగ్గింది. గణాంక మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం.. 2025లో దేశవ్యాప్తంగా సుమారు 61.6 కోట్ల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఇందులో 41.6 కోట్ల మంది పురుషులు ఉండగా.. 20 కోట్ల మంది మహిళలు ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం ఏటా పెరుగుతోందని ఈ నివేదిక వెల్లడించింది.
Follow Us