BREAKING: మహిళలకు గుడ్‌న్యూస్‌... సుప్రీంకోర్టు సంచలన తీర్పు

సాయుధ బలగాల్లో మహిళలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా షార్ట్‌ సర్వీస్ కమిషన్ (SSCO) ఆఫీసర్లు శాశ్వత కమిషన్ అధికారిణులుగా మారేలా హక్కులు కల్పించింది. ఆర్మీలో కూడా లింగ సమానత్వాన్ని బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

New Update
Women military officers entitled to Permanent Commission, says Supreme Court

Women military officers entitled to Permanent Commission, says Supreme Court


సాయుధ బలగాల్లో మహిళలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా షార్ట్‌ సర్వీస్ కమిషన్ (SSCO) ఆఫీసర్లు శాశ్వత కమిషన్ అధికారిణులుగా మారేలా హక్కులు కల్పించింది. ఆర్మీలో కూడా లింగ సమానత్వాన్ని బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. శాశ్వత కమిషన్ కేవలం పురుషులకు మాత్రమే పరిమితం అవుతుందని ఇకనుంచి పురుష షార్ట్ సర్వీస్ కమిషన్ అధికారులు (SSCO)లు ఆశించలేరని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.   

Also Read: అమెరికాలో భారీ అగ్నిప్రమాదం..పెలిన హీటర్‌ .. కమ్మేసిన పొగ!

శాశ్వత కమిషన్‌లోకి మహిళా SCCOలను తీసుకోకపోవడం మన సిస్టమ్‌లో పాతుకుపోయిన వివక్షేనని కోర్టు పేర్కొంది. ఏటా కేవలం 250 మంది అధికారిణులను మాత్రమే శాశ్వత కమిషన్‌లోకి తీసుకోవాలనే రూల్‌ పరిమితిని ఎత్తివేస్తున్నట్లు తేల్చిచెప్పింది.'' మహిళలకు శాశ్వత కమిషన్‌లో ఎప్పటికీ అర్హత ఉండదని భావించి వాళ్ల వార్షిక గోప్య నివేదిక (ACR)ను రూపొందించారు. దీంతో పురుషులతో పోల్చి చూస్తే మహిళా అధికారిణులపై ఎఫెక్ట్‌ పడింది. మూల్యాంకనంలో ఉన్న లోపాలు వాళ్ల కేరిర్‌ పురోగతిని అడ్డుకున్నాయి. గతంలో కోర్టు మహిళల శాశ్వత కమిషన్‌పై ఇచ్చిన ఆదేశాల అమలులో ఆలస్యం జరిగింది. దీంతో ఎందరో అధికారిణులపై ప్రతికూల ప్రభావం పడ్డట్లు'' కోర్టు తెలిపింది. 

Also Read:  పశ్చిమాసియాలో మరో సంచలనం.. ఇరాన్‌-అమెరికా యుద్ధంలోకి మరో రెండు దేశాలు

భారత వైమానిక దళంలో 2019లో తీసుకొచ్చిన కనీస పనితీరు ప్రమాణాలను అధికారులకు కావాల్సిన సమయం ఇవ్వకుండానే హడావిడిగా అమలు చేసినట్లు కోర్టు తెలిపింది. అలాగే నౌకాదళంలో డైనమిక్ వేకెన్సీ మోడల్‌లో పారదర్శకత లోపించినట్లు చెప్పింది. అయితే ఎంపిక ప్రమాణాలు, మార్కులను రక్షణ మంత్రిత్వ శాఖ, నౌకాదళం వెల్లడించకపోవడంతో పురుష అధికారులకు సమస్యలు ఎదురైనట్లు పేర్కొంది. 

Advertisment
తాజా కథనాలు