/rtv/media/media_files/2025/02/21/glrNBIUFyJ3R3ZL7hErq.jpg)
America Deportation
అమెరికాలో అక్రమ భారతీయ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కపాదం మోపిన సంగతి తెలిసిందే. వాళ్లని ప్రత్యేక విమానంలో ఇండియాకు పంపిస్తోంది. అయితే వాళ్లకి సంకెళ్లు వేసి తీసుకురావడంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. గతవారం రెండు బ్యాచుల్లో వచ్చిన అక్రమ భారతీయ వలసదారుల్లో మహిళలు, చిన్నారులకు సంకెళ్లు వేయలేదని పేర్కొంది.
Also Read: హత్య బెదిరింపులపై స్పందించిన ఏక్‌నాథ్ షిండే.. ఏమన్నారంటే ?
'' అక్రమ వలసదారులను స్వదేశానికి పంపించేటప్పుడు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, మతపరమైన అంశాలు దృష్టిలో పెట్టుకోవాలని ట్రంప్ ప్రభుత్వం వద్ద ప్రస్తావించాం. దీని ప్రకారమే ఫిబ్రవరి 15,16 తేదీల్లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు వచ్చిన వాళ్లలో చిన్నారులు, మహిళలకు ఎలాంటి సంకెళ్లు వేయలేదని'' కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు.
అలాగే కోస్టారియా, పనామాకు తరలిస్తున్న అక్రమ వలసదారుల్లో భారతీయులు ఉండొచ్చా అని మీడియా ఆయన్ని ప్రశ్నించింది. అయితే ఆ వివరాలు తెలుసుకునేందుకు కేంద్రం పనిచేస్తోందని రణ్‌ధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు. ఒకవేళ వాళ్లలో భారతీయులు గనుక ఉన్నట్లయితే స్వదేశానికి తీసుకొచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.
Also Read: పదవ తరగతి పరీక్షల్లో చీటింగ్ జరిగిందని తుపాకులతో కాల్పులు.. ఒకరు మృతి
ఇదిలాఉండగా.. ట్రంప్ అధికారంలోకి వచ్చాక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్రమ వలసదారులపై ఆయన చర్యలకు ఉపక్రమించారు. అమెరికా డిపోర్టేషన్‌లో భాగంగా ఫిబ్రవరి 5న 104 మంది అక్రమ వలసదారులతో కూడిన మొదటి విమానం అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. అయితే వాళ్లకు సంకెళ్లు వేసి తరలించారని వచ్చిన వార్తలు తీవ్ర దుమారం రేపాయి. విపక్షాలు సైతం విమర్శలు గుప్పించాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఇక ఫిబ్రవరి 15న 116 మంది, 16న 112 మంది అమెరికా విమానంలో అమృత్‌సర్‌కు చేరుకున్నారు.
Also Read: మరో మీర్ పేట మర్డర్.. 20 ఏళ్లుగా ఫ్రిజ్ లోనే పుర్రె, అస్థి పంజరం.. ఆ డెడ్ బాడీ ఎవరిది?