డీలిమిటేషన్ చిక్కుముడితో వీగిపోయిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు.. బీజేపీ తొందరపడిందా ?

లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. ఓటింగ్‌లో 528 మంది ఎంపీలు పాల్గొనగా కేంద్రానికి అనుకూలంగా 298 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు.

New Update
131st Amendment bill Failed

131st Amendment bill Failed

లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. ఓటింగ్‌లో 528 మంది ఎంపీలు పాల్గొనగా కేంద్రానికి అనుకూలంగా 298 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. బిల్లు అమలు కావాలంటే కనీసం 352 ఓట్లు కావాల్సి ఉండగా కేంద్రం ఈ మార్కును అందుకోలేకపోయింది. దీంతో మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌ అమలుకు బ్రేక్‌ పడింది. ఈ బిల్లు వీగిపోవడంతో డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులను కూడా కేంద్రం వెనక్కి తీసుకుంది. మొత్తానికి ఈ మూడు బిల్లులకు పార్లమెంటులో ఆమోదం లభించకుండా పోయింది. 

ఈ మూడు బిల్లులకు కేంద్రం మహిళా రిజర్వేషన్లను ముడిపెట్టినప్పటికీ అనుకూలంగా ఓట్లు రాలేవు. దీంతో విపక్ష పార్టీలు ఈ బిల్లులకు ఆమోదం లభించకపోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఎన్డీయే కూటమి విపక్షాలపై విరుచుకుపడుతోంది. మహిళలకు అన్యాయం చేశారంటూ విమర్శిస్తోంది. ఒకవేళ ఈ బిల్లులు ఆమోదం పొంది డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లు తగ్గుతాయనే ఆందోళనలు ఉన్నాయి. బిల్లు వీగిపోవడంతో ప్రస్తుతానికి ఈ ముప్పు తప్పింది. 

Also Read: ఢిల్లీలో రేపు కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ.. మోదీ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

బీజేపీ తొందపడిందా ? 

రాజ్యాంగ సవరణ లాంటి బిల్లులు ప్రవేశపెట్టేటప్పుడు పార్లమెంట్‌లో కచ్చితంగా ఓటింగ్ జరగుతుంది. కాబట్టి విపక్ష పార్టీలతో ముందే ఏకాభిప్రాయం సాధించాలి. వాళ్లు ఇచ్చే సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకొని మార్పులు, చేర్పులు చేయాలి. కానీ కేంద్రం మాత్రం ఈ విషయంలో కాస్త తొందరపడిందని నిపుణులు అంటున్నారు. కనీసం అఖిలపక్ష  సమావేశం కూడా నిర్వహించకుండా ముందుకు వెళ్లిందన్నారు. ఈ నిర్ణయమే విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. కేంద్రం ఇప్పుడే తొందరపడకుండా విపక్ష పార్టీలతో మాట్లాడి వాళ్ల సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు వెళ్లి ఉంటే ఈ బిల్లుకు ఆమోదం లభించే అవకాశం ఉండేదని అంటున్నారు. 

మరోవైపు మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం వల్ల కూడా విపక్షాలకు ప్రభుత్వంపై దాడి చేసే అవకాశం దక్కింది. "మహిళలకు రిజర్వేషన్లు ఇస్తామంటూనే, దేశ ఎన్నికల మ్యాప్‌ను మార్చే కుట్ర చేస్తోందని వారు ప్రచారం చేయగలిగారు. కేంద్రం అమలు చేయాలనుకుంటున్న ఈ మహిళా రిజర్వేషన్‌ అంశంలో 33 శాతం మహిళలకు ఎంపీ సీట్లు వస్తాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీ మహిళలకు మాత్రమే అంతర్గత రిజర్వేషన్ ఉంది.

కానీ ఓబీసీ మహిళలకు ఇందులో ప్రత్యేక కోటా లేదు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ ఈ బిల్లును మహిళల సాధికారత కోసం తెచ్చింది కాదంటూ విమర్శించింది. ఓబీసీ మహిళలకు కేంద్రం అన్యాయం చేస్తోందని నిలదీసింది. అలాగే మహిళా రిజర్వేషన్లకు డీలిమిటేషన్‌ను ముడిపెట్టడంపై కూడా విమర్శించింది. ఈ అంశాలే 131వ రాజ్యంగ సవరణ బిల్లుకు ఆమోదం లభించకుండా చేశాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు తాము మహిళలకు రిజర్వేషన్లు ఇస్తామని చెబుతున్నప్పటికీ ఈ మూడు బిల్లుల్లో ఎక్కడా కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు అని ప్రత్యేకంగా ప్రస్తావించలేదని అంటున్నారు. 

Also Read: రాజ్యాంగంపై దాడిని అడ్డుకున్నాం...రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్!

మరికొందరు విశ్లేషకులు ఇది బీజేపీ కావాలని చేసిన పని అని కూడా అంటున్నారు. "మేము మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రయత్నించాం, కానీ విపక్షాలే అడ్డుకున్నాయి" అని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ ఓటమిని ఒక రాజకీయ అస్త్రంగా బీజేపీ వాడుకునే ఛాన్స్‌ ఉంది. మరికొన్ని రోజుల్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లులు వీగిపోవడంతో ఇది ఎన్నికలపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

కొత్త బిల్లు తీసుకొస్తుందా ?

131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో కేంద్రం మళ్లీ కొత్త బిల్లు తీసుకొచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  విపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లు, మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టకుండా విడిగా ఒక బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. ఒకవేళ డీలిమిటేషన్ తప్పనిసరి అని కేంద్రం భావిస్తే, దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గకుండా ఉండేలా ఒక బలమైన లిఖితపూర్వక హామీ లేదా గ్యారెంటీతో విపక్షాలను ఒప్పించాల్సి ఉంటుంది.

Advertisment
తాజా కథనాలు