/rtv/media/media_files/2025/03/04/fEpTXq9pAHY1c13dP3d0.jpg)
టీమిండియా (Team India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ను ఉద్దేశించి కాంగ్రెస్ నాయకురాలు షామా మొహమ్మద్ చేసిన కామెంట్స్ సంచనలంగా మారాయి. ఈ క్రమంలో ఆమె కామెంట్స్ పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. బీజేపీతో పాటుగా సొంత పార్టీలోని కొంతమంది నాయకులు, మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీంతో ఇంతకీ ఎవరీ షామా మహ్మద్ అని నెటిజన్లు ఆమె గురించి సెర్చింగ్ మొదలుపెట్టారు.
Also Read : అలాగైతే మోడలింగ్ పోటీలకు వెళ్లండి.. షామా మహ్మద్కు గవాస్కర్ కౌంటర్
షామా మొహమ్మద్ (Shama Mohamed) 1973 మే 17న కేరళలోని కన్నూర్ జిల్లా న్యూమహే సమీపంలోని చెరుకల్లైలో జన్మించారు. ఆమె తన ప్రాథమిక విద్యను కువైట్‌లోని ఇండియన్ స్కూల్ నుండి పూర్తి చేశారు. ఆమె 1990 లో కువైట్ నుండి తిరిగి వచ్చి.. మంగళూరులోని యెనెపోయా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె దంతవైద్యురాలు కూడా. 2015లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరడానికి ముందు ఆమె జీ టీవీలో కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశారు. ఆమెకు పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 2015జూలైలో షామా మొహమ్మద్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జాతీయ ప్రతినిధిగా నియమితులయ్యారు. 2018 డిసెంబర్ లో కాంగ్రెస్ జాతీయ మీడియా ప్యానలిస్ట్‌గా నియమితులయ్యారు.
Also Read : ఆసీస్ బ్యాటర్ల వేగానికి భారత స్పిన్నర్లు కళ్ళెం వేస్తారా?
షామా మొహమ్మద్ కాంగ్రెస్ పార్టీ కేడర్‌లో చురుకైన నాయకురాలు, అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ, వివిధ మీడియా. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పార్టీ కథనాలను ముందుకు తీసుకువెళుతున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ షామా మొహమ్మద్ వ్యాఖ్యలకు దూరంగా ఉండి, ఆమె చేసిన పోస్ట్‌ను తొలగించమని ఆమెను కోరింది. ఇలా తన ప్రకటనలు మరియు పోస్టుల ద్వారా షామా వార్తల్లో నిలుస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో కోజికోడ్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ద్వేషపూరిత ప్రసంగం చేశారనే ఆరోపణలపై కేరళ పోలీసులు షామా మొహమ్మద్‌పై కేసు నమోదు చేశారు. కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రార్థనా స్థలాలు ప్రమాదంలో పడతాయని ఆమె ఆరోపించారు. ఎన్నికల కమిషన్ పంపిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 17 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటైన తర్వాత కాంగ్రెస్ నాయకురాలు షామా మహ్మద్ రోహిత్ శర్మను ఉద్దేశిస్తూ.. రోహిత్ ఫ్యాట్ గా ఉంటాడని, బరువు తగ్గాలని అన్నారు. రోహిత్ ఏదో లక్కీగా కెప్టెన్ అయ్యాడంటూ ఆమె చేసిన కామెంట్స్ రాజకీయ దూమరాన్ని రేపాయి. సచిన్, కోహ్లీ, ధోనీలతో పోలిస్తే రోహిత్ జస్ట్ యావరేజ్ ఆటగాడని షామా మొహమ్మద్ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు అత్యంత ఆకట్టుకోలేని కెప్టెన్ అతనేని ఆమె చెప్పుకోచ్చారు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ 44 పరుగుల తేడాతో గెలిచినప్పటికీ షామా తన పోస్టులో శర్మపై విమర్శలు గుప్పిస్తూ సంచలన కామెంట్స్ చేశారు.
Also Read : KKR కొత్త కెప్టెన్ ఇతడే.. ప్రకటించిన ఫ్రాంచైజీ
అయితే తాను చేసిన కామెంట్స్ కు తీవ్ర విమర్శలు రావడంతో షామా మొహమ్మద్ వాటిని తిప్పికొట్టడానికి ప్రయత్నించారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ తనకు ఉందంటూ చెప్పుకొచ్చారు. రోహిత్ ఫిట్‌నెస్ గురించి తాను సాధారణ ట్వీట్ మాత్రమే చేశానని.. ఇది బాడీ షేమింగ్ కాదన్నారు. ఒక క్రీడాకారుడు ఫిట్‌గా ఉండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని తెలిపారు. రోహిత్ కొంచెం బరువుగా ఉన్నాడని భావించాను, కాబట్టి నేను దాని గురించి ట్వీట్ చేసానని తెలిపారు. అలా చెప్పడంలో తప్పు ఏమిటి అని ఆమె ప్రశ్నించారు.