Delhi BJP CM : ఢిల్లీలో అధికారం దిశగా బీజేపీ.. సీఎం అభ్యర్థి అతనే !

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల కౌంటింగ్ సరిళిని పరిశిలిస్తే  దాదాపుగా బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోనుంది. అయితే బీజేపీ అధికారాన్ని చేపిడితే  సీఎం ఎవరు అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పూర్తి స్టోరీ చదవండి.

New Update
delhi bjp cm

delhi bjp cm

Delhi BJP CM: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల కౌంటింగ్ సరిళిని పరిశిలిస్తే  దాదాపుగా బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోనుంది. అయితే బీజేపీ అధికారాన్ని చేపిడితే  సీఎం ఎవరు అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీజేపీలో సీఎంను ఎన్నుకోవడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఈ సారి బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం కావాలని చాలామంది నాయకులకు ఉంది.  కానీ సీఎం పదవి ఎవరిని వరిస్తుందో తెలియదు.  

Also Read:🔴Delhi Elections Live Updates: పుంజుకున్న AAP.. కౌంటింగ్ లో బిగ్ ట్విస్ట్!

ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న వారిలో ప్రధానంగా ముగ్గురున్నారు. వారిలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా(Virendra Sachdeva), ఎంపీ మనోజ్ తివారీ(MP Manoj Thiwari), పర్వేశ్ వర్మ(Parvesh Verma).  బీజేపీ అత్యున్నత పదవులు ఇవ్వడం వెనుక ఉన్న వ్యూహన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. కాబట్టి ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే. ఒక్కోసారి ఈ ఊహాగానాలు కూడా నిజమే అని తేలిపోయే అవకాశం లేకపోలేదు. 

Also Read: Delhi Election Results 2025: కాంగ్రాట్స్ రాహుల్.. ఢిల్లీ ఫలితాలపై ట్విట్టర్లో కేటీఆర్ సెటైర్లు!

మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే  కేబినేట్ లో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. రాజస్థాన్‌లో ప్రముఖ నాయకురాలు  వసుంధర రాజే, మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్‌లను బీజేపీ తిరిగి  ముఖ్యమంత్రిని  చేయలేదు కాబట్టి, ఢిల్లీలో ముఖ్యమంత్రి పదవికి మనోజ్ తివారీ, వీరేంద్ర సచ్‌దేవా లేదా ప్రవేశ్ వర్మ పేర్లను ఖరారు చేస్తుందన్న నమ్మకం లేదు.  కానీ వీరిలో ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం మాత్రం ఉంది. 

Also Read: Delhi BJP CM : ఢిల్లీలో అధికారం దిశగా బీజేపీ.. సీఎం అభ్యర్థి అతనే !

మహిళ అభ్యర్థి కూడా సీఎం

ఢిల్లీలో మహిళ అభ్యర్థి కూడా సీఎం అయ్యే అస్కారం ఉంది.  ఆ పార్టీలో చాలా మంది తెలివైన, సమర్థులైన అభ్యర్థులు ఉన్నారు.  ఇందులో బన్సూరి స్వరాజ్, మీనాక్షి లేఖి, స్మృతి ఇరానీ పేర్లను కూడా బీజేపీ పరిశీలిస్తుందని తెలుస్తోంది.  ఈ ముగ్గురు మహిళల నేతలు బీజేపీలో సమర్థలుగా,  ప్రజలలో ప్రజాదరణ పొందిన నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్నారు . వీరిలో ఎవరైనా ముఖ్యమంత్రి అయితే బీజేపీకి లభించే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఢిల్లీలో పంజాబీ, పూర్వాంచలి, జాట్-గుజ్జర్ రాజకీయాలు, వర్గపోరాటాలు అంతమవుతాయి. ఢిల్లీలోని మహిళలు ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ మద్దతుదారులుగా ఉన్నారు.  దీని ద్వారా ఓ మహిళను ముఖ్యమంత్రి చేస్తే భవిష్యుత్తులో ఆ ఓటు బ్యాంకును బీజేపీకి షిప్ట్ చేసుకోవచ్చు.

Also Read: ఓటమి దిశగా సీఎం.. ముందంజలో రమేష్ బిదూరి

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు