Mahakumbh Mela: దేవుళ్లు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగితే.. కుంభమేళ ఎందుకొచ్చిందంటే..?

అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగింది. అందులో 12 చుక్కల అమృతం ఒలికి 4 చుక్కలు భూమిపై,8 చుక్కలు స్వర్గంలో పడ్డాయి. ఆ 4 చుక్కలు నదుల్లో పడ్డాయి. 12ఏళ్ల ఓ సారి అక్కడ కుంభమేళ నిర్వహిస్తారని హిందూ పురాణాలు చెబుతున్నాయి.

author-image
By K Mohan
New Update
kumbhamela

kumbhamela Photograph: (kumbhamela)

Mahakumbh Mela: దేవతలు, రాక్షసుల మధ్య భీకర యుద్ధం వచ్చింది. అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలుకుతుండగా.. మత్తెక్కించే సురాభాండం, అప్సరసలు, అమూల్యమైన మాణిక్యాలు, కోరికలు తీర్చే కల్పవృక్షము, కామధేనువు, ఐరావతం, విషం, పారిజాత వృక్షం పాలసముద్రం నుంచి బయటకొచ్చాయి. వాటిని ఇరువురూ పంచుకున్నారు. చివరికి అమృతం విషయంలో దేవతలు, రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది. మాకంటే.. మాకని దేవతలు, రాక్షసులు యుద్ధానికి దిగారు. ఆ రణరంగమంతా దద్దరిల్లింది. అప్పుడు అమృతం ఉన్న కలశం జారిపోయి 12 చుక్కలు కిందపడ్డాయి. వాటిలో 8 చుక్కలు స్వర్గంలో, నాలుగు చుక్కల అమృతం భూమీద పడింది. అవే ఇప్పటి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్.

పురాణాల్లో కుంభమేళ(Kumbh Mela)..

పురాణాల ప్రకారం.. ఈ ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా చెప్పుకుంటారు. భాగవతం, మహాభారతం, గాథ రామాయణం, ఇతిహాసాలు,  ఆథ్యాత్మిక గ్రంథాల్లో ఈ క్షీరసముద్రం గురించి ప్రస్తావించారు. ప్రయాగ్‌రాజ్ సంగమం, ఉజ్జయిని శిప్రా, హరిద్వార్‌లోని గంగ, నాసిక్‌లోని గోదావరిలో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే ఈ నదుల ఒడ్డున 12 సంవత్సరాలకు ఓసారి కుంభమేళా నిర్వహిస్తారు. కుంభమేళలో పవిత్రస్నానాన్ని ఆచరించడానికి ప్రపంచ నలుమూలల నుంచి కోట్లాది భక్తులు వస్తారు. 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు.. 45 రోజులపాటు ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ఉత్సవాలకు జరగనున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణకు యూపీ ప్రభుత్వం రూ. 7,500 కోట్లను మంజూరు చేసింది. దాదాపు 40 కోట్లమందికి పైగా భక్తులు.. సాధువులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ కుంభవేళ రహస్యాలేంటి? అర్ధ కుంభ, పూర్ణ కుంభ, మహాకుంభమేళాల మధ్య తేడాలేంటి? హిందూ పురాణాలు కుంభవేళ గురించి ఏం చెబుతున్నాయని తెలుసుకోవడానికి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి.

Also Read :  గ్యాస్‌ స్టేషన్‌ లో పేలుడు..15 మంది మృతి!

అర్థ, పూర్ణ, మహాకుంభమేళ(Mahakumbh Mela) మధ్య తేడా

హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రయాగ్‌రాజ్ సంగమంలో మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమై, ఫిబ్రవరి 26 న మహాశివరాత్రితో ముగుస్తుంది. ప్రతి ఆరేళ్లకోసారి జరిగే కుంభమేళాను అర్ధ కుంభమేళా అంటారు. ఇది ప్రయాగ్‌రాజ్, హరిద్వార్‌లో మాత్రమే జరుగుతుంది. 12 సంవత్సరాలకు ఓసారి నిర్వహించే కుంభమేళాను పూర్ణకుంభమేళ అంటారు. ప్రయాగ్‌రాజ్‌లోని సంగం ఒడ్డున దీన్ని నిర్వహిస్తారు. చివరిసారిగా 2013 లో ఇక్కడ పూర్ణ కుంభమేళా జరిగింది. 12 పూర్ణ కుంభమేళాలు నిర్వహిస్తే.. 144 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఇలా 144ఏళ్లకు వచ్చే కుంభమేళను మహాకుంభమేళ అంటారు. 2025 ప్రయాగ్‌రాజ్‌లో జరగబోయే కుంభమేళ 144 ఏళ్ల తర్వాత వచ్చినది. అందుకే దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. భూమి మీద 144 సంవత్సరాలు.. దేవతలకు 12 సంవత్సరాలతో సమామని పురాణాలలో చెప్పుకుంటారు.

Also Read :  నేటినుంచే మహా కుంభ మేళా..దేశ వ్యాప్తంగా 13 వేల రైళ్లు!

గ్రహాల కదలికలను బట్టి..

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల కదలికలను బట్టి కుంభమేళను నిర్వహిస్తారు. సూర్యుడు మకరరాశిలో బృహస్పతి వృషభరాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్‌రాజ్‌లోని సంగమ క్షేత్రంలో కుంభమేళా జరుగుతుంది. బృహస్పతి కుంభరాశిలో.. సూర్యుడు మేషరాశిలోకి సంచరిస్తున్నప్పుడు హరిద్వార్‌లోని గంగా నదిలో కుంభమేళ నిర్వహిస్తారు. గురుడు సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు నాసిక్‌లోని గోదావరిలో కుంభమేళా నిర్వహిస్తారు. బృహస్పతి సింహరాశిలో.. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోని శిప్రా నదిలో కుంభమేళా నిర్వహిస్తారు.

Also Read :  బాలయ్య ఫ్యాన్స్కు బిగ్ షాక్.. ఆన్లైన్ లో డాకు మహారాజ్ HD ప్రింట్

చరిత్ర ఏం చెబుతుందంటే..?

అమృతం కోసం జరిగిన యుద్ధంలో చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడని. గురువు కలశం దాచాడని. సూర్య దేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడని.. శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడని పురాణాల్లో ఉంది. అందుకే ఈ గ్రహాలు కలిసిన సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది. ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షించబడింది. ఆ తర్వాత దేవతలందరూ విష్ణుమూర్తి సాయంతో అమృతాన్ని సేవించారు. మహాకుంభమేళా వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు. కుంభమేళ సమయంలో నదిలో నీరు అమృతమని హిందువులు విశ్వసిస్తారు. అందులో స్నానమాచరిస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు. కుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దీన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు. కొందరు చరిత్రకారులు హర్షవర్థనుడి కాలంలో కుంభమేళా ఆధారాలు ఉన్నాయని వాదిస్తున్నారు. 

ప్రయాగ్‌రాజ్ కుంభమేళ విశేషాలు

ఈ కుంభమేళాలో 5.5 కోట్ల రుద్రాక్షలతో 12 జ్యోతిర్లింగాలను సిద్ధం చేస్తున్నారు. 11వేల త్రిశూలాలను కూడా ఉపయోగించనున్నారు. మొదటి స్నానానికి ముందు మొత్తం 12 జ్యోతిర్లింగాలను సిద్ధం చేశారు. 
మొదటి స్నానానికి ముందు మహాకుంభానికి వచ్చే భక్తులకు ఇది ప్రధాన ఆకర్షంగా నిలవనుంది. అమేథీలోని మహాకుంభ సెక్టార్ 6లోని సంత్ పరమహంస ఆశ్రమంలో ఈ ప్రత్యేకమైన జ్యోతిర్లింగాన్ని నిర్మిస్తున్నారు. ఈ శిబిరం నాగవాసుకి ఆలయం ముందు ఉంది. దీనికోసం నేపాల్, మలేషియా నుంచి రుద్రాక్షలను దిగుమతి చేశారు. ప్రతి జ్యోతిర్లింగం 9 అడుగుల వెడల్పు, 11 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇందులో ఉపయోగించిన 11వేల త్రిశూలాలకు తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు రంగులు వేస్తారు. జనవరి 12 నాటికి 12 జ్యోతిర్లింగాల నిర్మాణ పనులు పూర్తవుతాయని, జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు భక్తులను దర్శనానికి, పూజలకు అనుమతిస్తారు.

రాజస్నానాల వివరాలు..

ఈ మహా కుంభానికి దేశం నలుమూలల నుంచి సాధువులు వస్తారు. వీరిలో అఖారాకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. అఖారా అంటే సాధువులు, ఋషుల సమూహం. మహాకుంభంలో వివిధ అఖారాలకు చెందిన సాధువులు పవిత్ర నదిలో స్నానం చేస్తారు. శంకరాచార్యులు సనాతన ధర్మం, హిందూ మతాన్ని రక్షించడానికి వీళ్ళను సృష్టించారట. వీరి సమూహాన్నే అఖారాలని అంటారు. దేశవ్యాప్తంగా 13 అఖారాల సమూహాలు ఉన్నాయి. 2025 జనవరి 13న పుష్య పౌర్ణమి నాడు మహాకుంభమేళా ప్రారంభమై తొలి రాజస్నానం జరుగుతుంది. రెండో రాజస్నానం మకర సంక్రాంతి రోజు అంటే 2025 జనవరి 14న నిర్వహిస్తారు. మూడవ షాహీ స్నాన్- మౌని అమావాస్య రోజు 2025 జనవరి 29 న, నాల్గవ రాజస్నానం ఫిబ్రవరి 3 వసంత పంచమి నాడు, ఐదవ రాజ స్నానం ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ నాడు, ఆరవ షాహీ స్నానం ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజే మహాకుంభమేళా చివరి రోజు. ఇలా 12 సంవత్సరాలకు ఓసారి ఘనంగా కుంభమేళ నిర్వహిస్తారు. హిందువులు పవిత్ర స్నానం ఆచరించడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు.

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు