/rtv/media/media_files/2025/02/07/iI8FGefqLSBI7lLH8AU9.jpg)
Deportees From USA
ఏజెంట్ల చేతిలో మోసపోయి..లక్షలు పోగొట్టుకుని...అటు కలలు కన్న అమెరికాలో ఉండలేక..బహిష్కరణకు గురై అంతకు మించి అవమానం పాలై మొత్తం 104 మంది ఇండియాకు తిరిగివచ్చారు. తిరిగి వచ్చారు అని చెప్పడం కంటే ఖైదీల్లా కట్టేసి తీసుకువచ్చారు అని చెప్పడం కరెక్ట్ ఏమో. ఇలా వచ్చిన ప్రతీ ఒక్కరిదీ ఒకో కన్నీటి గాధ. మంచి జీవితం కోసం తాపత్రయం పడితే అదీ దక్కలేదు...ఇండియాలో కూడా మామూలుగా జీవితం జీవించే పరిస్థితి లేదు. ఇప్పుడు తాము ఎలా ఉండాలనేది వారందరి ప్రశ్న. వీళ్ళందరూ డాంకీ రూట్ ద్వారా అమెరికాలో ప్రవేశించడానికి ప్రయత్నించిన వాళ్ళే. మెక్సికో బోర్డర్ లో పట్టుబడి, అక్కడ కొన్నాళ్ళు బందీలుగా ఉండి..ఇప్పుడు భారత్ కు తిరిగి వచ్చారు. ఇప్పుడు వీరి భవితవ్యం ఏంటి అని అందరూ అడుగుతున్న ప్రశ్న.
సాధారణ భారతీయుడిలా బ్రతకాలి...
అమెరికా వెళ్ళాలని, బాగా బతకాలని ఎన్నో కలలు కన్నారు. అవన్నీ కల్లలు అయ్యాయి. దానికి తోడు డబ్బులు కూడా పోయాయి. దీంతో అమెరికా నుంచి వారందరూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. అయితే ఇలా వచ్చిన వారిపై ఎటువంటి చట్టపరమైన చర్యలు ఉండవు అని చెబుతున్నారు. నిజమైన పాస్ పోర్ట్ ఉండి, చెల్లుబాటు అయ్యే పత్రాను ఉపయోగించినట్లైతే వారిని ఎవరూ ఏ చేయరు అని చెబుతున్నారు ఢిల్లీ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు కెకె. మనన్. నకిలీ పాస్ పోర్ట్ లు, లేదా ఫోటోలు ఉపయోగించిన వారు...మోసపూరితంగా అమెరికా వెళ్ళడానికి ప్రయత్నించిన వారి మీద మాత్రం చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పుడు వచ్చిన వారిలో చాలా మంది తక్కువ చదువుకున్న వారు, పేద కుటుంబాలు వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ వ్యక్తులు నకిలీ పత్రాలను తయారు చేయడంలో పాల్గొనే అవకాశం చాలా తక్కువ అని చెబుతున్నారు. వీళ్ళు ఇక్కడ అంతా ప్రోసీజర్ అయిపోయాక వాళ్ళ ఊళ్ళు లేదా గ్రామాలు వెళ్ళి ఎప్పటిలానే బతకొచ్చని చెబుతున్నారు.
మళ్ళీ అమెరికా వెళ్ళే ఛాన్స్...
ఇప్పుడు బహిష్కరణకు గురైన వాళ్ళు మళ్ళీ అమెరికా వెళ్ళే ఛాన్స్ ఉంటుందా..అంటే కష్టమేనని చెబుతున్నారు. ఎందుకంటే మళ్ళీ వెళ్ళాలంటే తప్పనిసరిగా వీసా ఫారమ్ నింపాల్సి ఉంటుంది. అందులో ఎప్పుడైనా బహిష్కరణకు గురైయ్యారా అనే ప్రశ్న ఉంటుంది. దాని కచ్చితంగా నింపాల్పి కూడా ఉంటుంది. అందులో గురయ్యామని చెబితే మళ్ళీ వీసా ఇవ్వరు. ఒక్క అమెరికానే కాదు దీనివలన చాలా దేశాలు వీసాలు నిరాకరిస్తాయి. అంతేకాదు ఇప్పుడు బహిష్కరణకు గురైన వాళ్ళు 5 నుంచి 10 ఏళ్ళ వరకూ అసలు వీసా దరఖాస్తు చేసుకోవడానికే ఒప్పుకోరు అని చెబుతున్నారు.
ఏజెంట్లపై చర్యలు తీసుకుంటారా..
లక్షల రూపాయలు తీసుకుని అమాయకులను మోసం చేసిన ఏజెంట్ల పరిస్థితి ఏంటని ప్రశ్నలు వచ్చిన్పుడు..వారిపై చ్చింగా చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు కే.కే. మనన్. ట్రావెల్ ఏజెన్సీలను పట్టుకుని...ఏజెంట్లపై చర్యలు తీసుకునే విధంగా దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. ఈ వ్యక్తులను చట్టవిరుద్ధంగా అక్కడికి పంపడంలో ప్రధాన పాత్ర పోషించిన వారే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాలని చెప్పారు. బహిష్కరణకు గురైన వారిని విదేశాలకు ఎవరు పంపారు మరియు వారిని ఎలా పంపించారు అనే దానిపై సమగ్ర దర్యాప్తు జరగాలని అన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటు కూడా లేవనెత్తాలని డిమాండ్ చేస్తామని తెలిపారు. సైబర్ డొమైన్‌లో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA), రాష్ట్ర పోలీసు అధికారుల సహకారంతో అక్రమ నియామక ఏజెంట్లపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Also Read: USA: మొదట మిస్ అయింది...తరువాత కూలిపోయింది...అమెరికాలో మళ్ళీ విమాన ప్రమాదం