/rtv/media/media_files/2026/05/07/vijay-governor-2026-05-07-13-28-02.jpg)
Rajendra Vishwanath Arlekar: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టి ప్రభుత్వ ఏర్పాటుకు తహతహలాడుతున్న సూపర్ స్టార్ విజయ్(vijay tvk) కు ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చుక్కలు చూపిస్తున్నారు. 118 మంది మద్దతు ఉంటేనే లోపలికి రండి అంటూ ఆయన వేస్తున్న ప్రశ్నలు, విధిస్తున్న నిబంధనలు దళపతి అభిమానుల్లో ఆగ్రహాన్ని, రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అసలు ఎవరూ ఈ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్?
Also Read: విజయ్ నీకు ఆరు నెలలు టైమ్ ఇస్తాం.. స్టాలిన్ సంచలన కామెంట్స్!
గోవాలోని పనాజీలో విశ్వనాథ్ ఆర్లేకర్, తిలోమత్తమ దంపతులకు జన్మించిన అర్లేకర్, తన ప్రస్థానాన్ని 1989లో బీజేపీలో సామాన్య కార్యకర్తగా ప్రారంభించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలంతో పెరిగి, ఎమర్జెన్సీ సమయంలో జైలుకెళ్లారు. గోవా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు పార్టీ యంత్రాంగంపై పట్టును ఇచ్చింది. 2002లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడే ఆయన స్పీకర్ గా ఎన్నికయ్యారు.
Also Read: అదిరిపోయే అప్‌డేట్.. బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ స్పెషల్ సాంగ్!
గోవా స్పీకర్‌గా ఉన్నప్పుడు ఆయన చేసిన ఒక సాహసం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. దేశంలోనే మొట్టమొదటి పేపర్‌లెస్ అసెంబ్లీని రూపొందించింది ఈయనే. 2015అక్టోబర్ లో ఆయన గోవా ప్రభుత్వంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా కూడా సేవలదించారు. అసెంబ్లీ నిబంధనలు, రాజ్యాంగ సూత్రాలను తూచా తప్పకుండా పాటించడంలో ఆయన సిద్ధహస్తుడనే పేరుంది.
హిమాచల్ , బీహార్ రాష్ట్రాలకు గవర్నర్
హిమాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన ఈయన, 2025 నుంచి కేరళ గవర్నర్(governor) గా కొనసాగుతూనే తమిళనాడు అదనపు బాధ్యతలు చేపట్టారు.సాధారణంగా గవర్నర్లు అతిపెద్ద పార్టీని పిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండని చెబుతారు. కానీ అర్లేకర్ మాత్రం మ్యాజిక్ ఫిగర్ 118 ఉంటేనే రండని పట్టుబట్టడం వెనుక రెండు కారణాలు ఉండవచ్చు. ఒకటి.. ప్రభుత్వం ఏర్పడ్డాక అది పడిపోకుండా స్థిరంగా ఉండాలనే రాజ్యాంగ నిబద్ధత. రెండు.. తనకున్న అపారమైన స్పీకర్ అనుభవంతో ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకూడదనే పంతం. కాగా విశ్వనాథ్ ఆర్లేకర్ అనఘను వివాహం చేసుకున్నాడు.ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Also Read: TMC రెండు ముక్కలు...మమత మీటింగ్‌కు 10 మంది ఎమ్మెల్యేల డుమ్మా!
Follow Us