West Bengal: బెంగాల్ సీఎస్‌ సంచలన ఆదేశాలు.. ఒక్క ఫైల్‌ బయటికి వెళ్లినా కఠిన చర్యలు

మొదటిసారిగా బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రానుండటంతో ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైళ్లు, కీలక పత్రాల భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలక ఆదేశాలు జారీ చేశారు. 

New Update
West Bengal

West Bengal

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ బంపర్ విక్టరీ సాధించింది. 200లకు పైగా స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక తృణమూల్ కాంగ్రెస్ (TMC) మాత్రం 72 సీట్లకే పరిమితమైంది. మొదటిసారిగా అక్కడ బీజేపీ అధికారంలోకి రానుండటంతో బెంగాల్‌ ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైళ్లు, కీలక పత్రాల భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలక ఆదేశాలు జారీ చేశారు. 

 ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఎలాంటి కీలక పత్రాలు లేదా ఫైళ్లు బయటకు వెళ్లకుండా చూడాలన్నారు. అవి దెబ్బతినకుండా లేదా తీసివేయకుండా అత్యంత జాగ్రత్త వహించాలని అన్ని శాఖల కార్యదర్శులను, విభాగాధిపతులను (HoDs) ఆదేశించారు. అలాగే కార్యాలయాల్లోని ఫైళ్లను అనధికారికంగా స్కాన్ చేయడం లేదా కాపీలు తీయడం లాంటి పనులు చేయకూడదన్నారు. 

Also Read: ఆటో డ్రైవర్ To అసెంబ్లీ.. ఇది మామా విక్టరీ అంటే..!

ప్రతి ఫైల్, కమ్యూనికేషన్ రికార్డుకు సంబంధించిన పూర్తి లెక్కలు ఉండాలని తెలిపారు. ఈ ఆదేశాలను వెంటనే అమలు చేసేలా చూడాల్సిన బాధ్యత ఆయా శాఖల సెక్రటరీలదేనని సీఎస్ స్పష్టం చేశారు. పాలనాపరమైన గోప్యతను కాపాడటంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరికలు జారీ చేశారు.

Also Read: ఆ విషయంలో పవన్, KCR ఫెయిల్.. విజయ్ సక్సెస్.. ఇంట్రెస్టింగ్ న్యూస్!

Advertisment
తాజా కథనాలు