'నాన్న మనం గెలిచాం'.. మాజీ సీఎం కొడుకు ఎమోషనల్ పోస్ట్‌

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని UDF కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 140 స్థానాలకు గాను 102 స్థానాల్లో గెలిచింది. పూతుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దివంగత సీఎం ఊమెన్ చాందీ కొడుకు చాందీ ఊమెన్ భారీ మెజార్టీతో గెలిచారు.

New Update
Chandy Oommen

Chandy Oommen

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని UDF కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 140 స్థానాలకు గాను 102 స్థానాల్లో గెలిచింది. పూతుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దివంగత సీఎం ఊమెన్ చాందీ కొడుకు చాందీ ఊమెన్ భారీ మెజార్టీతో గెలిచారు. LDF అభ్యర్థి కేఎం రాధాకృష్ణన్‌పై ఏకంగా 52,907 ఓట్ల మెజార్టీతో బంపర్ విక్టరీ సాధించారు. ఈ గెలుపు సందర్భంగా ఆయన ఫేస్‌బుక్‌ వేదికగా మనం గెలిచాం నాన్న అంటూ ఓ ఎమోషనల్ పోస్టు చేశారు. అందులో ఆయన తన తండ్రి సమాధి పక్కన ఉన్న ఫొటోను జత చేశారు.

Also Read: ఆటో డ్రైవర్ To అసెంబ్లీ.. ఇది మామా విక్టరీ అంటే..!

ఇదిలాఉండగా చాందీ ఊమెన్ తండ్రి ఊమెన్ చాందీ దశాబ్దాల పాటు ఈ స్థానం నుంచే గెలుస్తూ వచ్చారు. ఆయన మరణాంతరం ఇక్కడ 2023లో ఉప ఎన్నికల్లో జరిగాయి. ఈ స్థానం నుంచి పోటీ చేసిన చాందీ ఊమెన్ విజయం సాధించగా.. ఈసారి కూడా అదే స్థానం నుంచి పోటీ చేసిన ఆయన మళ్లీ గెలిచారు. అంతేకాదు ఈ ఎన్నికల ప్రచారం కోసం చాందీ ఊమెన్ సైకిల్‌పైనే నియోజకవర్గమంతా తిరిగారు. ఖర్చులను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఫ్లెక్సీలు, పోస్టర్లను వినియోగించకుండానే ప్రచారం చేశారు. అంతేకాదు ప్రచార నిధులను తన నియోజకవర్గంలోని నిరాశ్రయులకు ఇళ్ల కోసం ఖర్చు చేస్తానంటూ ప్రకటన చేసి అందరి ప్రశంసలు పొంది చివరికి ఈ ఎన్నికల్లో గెలిచారు.

Also Read: 15 ఏళ్ల దీదీ పాలనకు ముగింపు.. బీజేపీకి విజయానికి దారితీసిన 10 ప్రధాన కారణాలు ఇవే !

Advertisment
తాజా కథనాలు