/rtv/media/media_files/2026/05/03/vinesh-phogat-2026-05-03-17-07-42.jpg)
Vinesh Phogat flags fear of bias, says govt to be responsible for any incident in Gonda
ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో జరగనున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌కు సంబంధించి స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2026 ఆసియా క్రీడల ఎంపికకు కీలకమైన ఈ పోటీల్లో 57 కేజీల విభాగంలో ఆమె పోటీ చేయనున్నారు. ఈ పోటీలో తనకు లేదా తన జట్టు సభ్యులకు ఏదైనా హాని తలపెట్టే ప్రమాదం ఉందని వినేశ్ ఫొగాట్ ఆరోపించారు. ఒకవేళ అలాంటి అవాంఛనీయ ఘటనలు ఏదైనా జరిగితే దీనికి భారత ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.
Also Read: చెన్నై ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన... ఎమర్జెన్సీ డోర్ నుంచి దూకేసిన ప్యాసిండర్
అయితే ఈ పోటీలు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు సపోర్ట్ ఉన్న గోండా ప్రాంతంలో జరుగుతున్నాయి. అందుకే దీనిపై వినేశ్ ఫొగాట్ తీబ్రిజ్‌భూషణ్ అడ్డాలో రెజ్లింగ్ పోటీ.. 'నాకేమైన జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత'.. వినేశ్ ఫొగాట్ సంచలన వ్యాఖ్యలు వ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిజ్ భూషణ్ తన అనుచరులు, సన్నిహితుల ద్వారా పోటీ ఫలితాలు తారుమారు చేసే ఛాన్స్ ఉందన్నారు. ఇక్కడ అంపైరింగ్ పక్షపాతంగా జరిగే ముప్పు ఉందన్నారు. ఇప్పటికే బ్రిజ్ భూషన్ వల్ల తాము చాలా నష్టపోయామని.. ఈ టోర్నీలో కూడా పారదర్శకత లోపించే ప్రమాదం ఉందని ఆరోపించారు.
Also Read: నేడే 'నీట్-యూజీ 2026'... అభ్యర్థులు ఈ నిబంధనలు పాటించాల్సిందే
ఈ క్రమంలోనే టోర్నమెంట్ నిర్వహణలో నిష్పాక్షికతను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని వినేశ్ ఫొగాట్‌డిమాండ్ చేశారు. పోటీలు నిర్వహిస్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు, క్రీడా వర్గాలు పెద్ద సంఖ్యలో వేదిక వద్ద ఉండి పర్యవేక్షించాలని కోరారు. రాజకీయ ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో క్రీడాకారుల భద్రతకు, క్రీడల పారదర్శకతకు భరోసా కల్పించాలన్నారు.
Follow Us