/rtv/media/media_files/2025/03/14/2TAevOE8JgOGcZLp4EGt.jpg)
Video Of Bus Journey In Himachal Goes Viral
హిమాచల్‌ప్రదేశ్ అంటే మనకు గుర్తుకువచ్చేది అందమైన ప్రకృతి. కొండలు, లోయలు, జలపాతాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది ఆ రాష్ట్రం. అక్కడ ఎక్కువగా కొండ ప్రాంతాలు ఉండటం, లోయలకు దగ్గరగా ఉండటం వల్ల రోడ్లపై ప్రయాణం చేయాలంటే భయంకరంగా ఉంటుంది. నిజానికి అలాంటి దారిలో వాహనాలు నడిపించడం పెద్ద సాహసమే. అయితే హిమాచల్‌ప్రదేశ్ ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి సంబంధించి ఓ కంటెంట్ క్రియేటర్ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు.
Also Read: వీధికుక్క నోట్లో అప్పుడే పుట్టిన పసికందు.. 45 రోజుల్లో మూడో ఘటన
తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బస్సు ప్రయాణం చేశామని రాసుకొచ్చారు. హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లినవారు ఎప్పుడైనా అక్కడ ప్రజా రవాణా సదుపాయాలు వినియోగించుకున్నారా అని అడిగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎత్తైన కొండల్లో వాటి అంచున బస్సు ప్రయాణిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. నెటిజన్లు ఆ బస్సు డ్రైవర్ల ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.
క్లిష్ట పరిస్థితుల్లో కూడా బస్సులను జాగ్రత్తగా నడుపుతూ ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న వాళ్లని పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. '' ఇది చంబా అనే ప్రాంతం నుంచి పంగి అనే మరో ప్రాంతానికి వెళ్లే రహదారి'' అని రాసుకొచ్చారు. మరో నెటిజన్.. హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రజలు కొండల అంచున కాదు తమ జీవితాల అంచున ప్రయాణం చేస్తారని కామెంట్ చేశారు.
Also Read: టార్గెట్ కేసీఆర్.. కేబినెట్లోకి రాములమ్మ.. హైకమాండ్ సంచలన వ్యూహం ఇదేనా?
Also Read: భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. హోలీ రోజు గుడ్లు కొట్టుకోవచ్చా? లేదా?