జైలు ఖైదీలకి వీడియో కాల్ చేసుకునే సదుపాయం..

ఛత్తీస్‌గఢ్‌ జైళ్లశాఖ ఖైదీల కోసం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంటి నుంచి దూరంగా జైల్లో ఉంటున్న ఖైదీలు తమ కుటుంబ సభ్యులను చూసేందుకు వీడియో కాలింగ్‌ సౌకర్యాన్ని తీసుకొచ్చింది.

New Update
Video call for jail inmates for Rs. 5 in Chattisgarh

Video call for jail inmates for Rs. 5 in Chattisgarh

ఛత్తీస్‌గఢ్‌ జైళ్లశాఖ ఖైదీల కోసం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంటి నుంచి దూరంగా జైల్లో ఉంటున్న ఖైదీలు తమ కుటుంబ సభ్యులను చూసేందుకు వీడియో కాలింగ్‌ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. రాయ్‌పుర్‌ సెంట్రల్‌ జైలు ప్రాంగణంలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిది. మదర్స్ డే సందర్భంగా 200 మంది మహిళా ఖైదీలున్న ఈ జైలులో ఈ ప్రత్యేక సదుపాయాన్ని ప్రారంభించారు. దీని ద్వారా మహిళా ఖైదీలు నేరుగా తమ పిల్లలు, కుటుంబ సభ్యులతో వీడియో కాలింగ్ మాట్లాడుతూ మానసిక ఉపశమనం పొందే వీలుంటుందని రాయ్‌పుర్‌ సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ యోగేష్‌ క్షత్రి తెలిపారు. 

Also Read: ముస్లింలు రోడ్లపై నమాజ్ చేయొద్దు.. సీఎం యోగీ ఆదిత్యనాథ్ హెచ్చరిక

ఈ వీడియో కాలింగ్‌ వ్యవస్థ పారదర్శకంగా, బయోమెట్రిక్‌ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఇందుకోసం ప్రతి మహిళా ఖైదీకి ఒక ప్రత్యేకమైన బయోమెట్రిక్‌ కార్డును జారీ చేస్తారు. ఖైదీలు తమ బయోమెట్రిక్‌ రిజిస్ట్రేషన్ పూర్తి చేశాకే ఈ కాలింగ్‌ సెషన్‌ ప్రారంభమవుతుంది. ఆ సమయంలో సదరు ఖైదీ పేరు స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఈ సౌకర్యం కింద వారం రోజులకు గరిష్ఠంగా 5 నిమిషాల పాటు మాట్లాడుకునేందుకు పర్మిషన్ ఇస్తారు. ఇందుకోసం నిమిషానికి రూ. 5 చొప్పున చెల్లించాలి. ఖైదీలు తమ కార్డులో ఉన్న బ్యాలెన్స్‌ ఆధారంగానే ఈ కాల్స్‌ చేసుకోవచ్చు.  కేటాయించిన 5 నిమిషాల సమయం ముగిశాక కాల్‌ ఆటోమేటిక్‌గా డిస్‌కనెక్ట్‌ అయిపోతుంది. 

Also Read: మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు

Advertisment
తాజా కథనాలు