/rtv/media/media_files/2025/01/28/PIJlKUEn4LHuEBTQ95Hz.jpg)
Uttarkhand Photograph: (Uttarkhand)
ఉత్తరాఖండ్‌లో పదవిలో ఉన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య కాల్పులు సంచలనం సృష్టిస్తున్నాయి. రూర్కీలోని ఖాన్‌పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉమేష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే లస్కర్ కన్వర్ ప్రణవ్ సింగ్ ఛాంపియన్ మధ్య పట్ట పగలే కాల్పులు జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గ్యాంగ్‌వార్ అనేలా ఈ కాల్పులు జరిగాయి. అయితే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య 2022 నుంచి వైరం ఉంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు కామెంట్ల చేసుకోవడంతో వివాదం ఇంకా ముదిరింది. దీంతో కాల్పులు జరుపుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: America: కాళ్లూ, చేతులు కట్టేసి.. నీళ్లు కూడా ఇవ్వకుండా.. అక్రమవలసదారుపై అమెరికా వికృత చేష్టలు!
Firing Kalesh Between BJP ex MLA Pranav Singh Champion and Ind. MLA Umesh Kumar ▄︻デ══━一💥#RepublicDay2025 #RepublicDay #AAP #DelhiElection2025 #ElectionCommission #Trending pic.twitter.com/qMHt6zHTIB
— Bharat ke Klesh & Updates (@mattersofindia) January 27, 2025
ఇది కూడా చూడండి: occult worship : కర్నూలు జిల్లా బి తాండ్రపాడు ఎస్సార్ విద్యాసంస్థల్లో క్షుద్ర పూజల కలకలం
కాల్పులు జరిపారని.. ఎదురు కాాల్పులు..
మాజీ ఎమ్మెల్యేని ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ దూషించారని.. ఛాంపియన్ అనుచరులు వారితో గొడవకు దిగారు. ఉమేష్ ఇంటి వద్ద రాళ్లు విసరడంతో పాటు కాల్పులు జరిపారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు కూడా మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి రాళ్లు విసరడంతో పాటు కాల్పులు జరిపారు. సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నాయకులను అరెస్టు చేశారు. వీరిద్దరిని కోర్టులో హాజరు పరచగా.. ఎమ్మెల్యేకు బెయిల్ లభించింది. కానీ మాజీ ఎమ్మెల్యేకు లభించలేదు. మాజీ ఎమ్మెల్యేకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
ఇది కూడా చూడండి: Vitamin D Injection: ఏడాదికి ఒకసారి విటమిన్ డి ఇంజెక్షన్‌తో లాభాలు
After that Ind. MLA Umesh Kumar They took a gun and set out for revenge.
— Bharat ke Klesh & Updates (@mattersofindia) January 27, 2025
Massive Kalesh. pic.twitter.com/iJryM1dl2p