Uttarakhand: ఇప్పటివరకు 33 మందిని కాపాడారు..మరో 22 మంది ఇంకా మంచులోనే..

ఉత్తరాఖండ్ లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో  ఆర్మీ ఇప్పటివరకు 33 మందిని కాపాడింది. ఇంకా మరో 22 మంది కార్మికులు మంచులోనే చిక్కుకుపోయి ఉన్నారు. మోకాళ్ల లోతు స్నోలో కార్మికులను కపాడ్డం కష్టతరం అవుతోంది. 

New Update
Uttarakhand

Uttarakhand Rescue

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో మంచు చరియలు విరిగిపడ్డ ఘటనలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో 55 మంది కార్మికులు మంచు కింద చిక్కుకున్నారు. వారిలో 33 మంది కార్మికులను సురక్షితంగా రక్షించారు. మిగిలిన 22 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆర్మీ విపత్తుశాఖ తెలిపింది. ఆర్మీ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేస్తోంది. అయితే మంచు విపరీతంగా ఉండడం, ఇంకా కురుస్తుండడంతో కార్మికులను వెతకడం చాలా కష్టం అవుతోంది. 

మంచు చాలా ఎక్కువ పడుతోంది..

ఉత్తరాఖండ్ ,బద్రీనాథ్ దారిలో ఆర్మీ కోసం ఓ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఈ పనులు జరుగుతుండగా మంచు చరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. దీంతో అక్కడ పని చేస్తున్న కార్మికులు మంచు కింద చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు సైన్యంతో పాటు, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. ప్రమాదంలో చిక్కుకుపోయిన వారిలో 33 మందిని రక్షించారు. మిగిలిన 22 మంది జాడ తెలియడం లేదు. వాతావరణ పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. రేపు ఉదయానికి వాతావరణం అనుకూలిస్తే హెలికాప్టర్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించవచ్చని చమోలీ జిల్లా కలెక్టర్ సందీప్ తివారీ చెప్పారు. సింగిల్ ఇంజిన్, డబుల్ ఇంజిన్‌తో నడిచే నాలుగు హెలికాప్టర్లు సహాయక చర్యల కోసం పంపించాం. ఎంఐ 17 పంపించాలని కూడా విజ్ఞప్తి చేశామని తెలిపారు. వాతావరణం అనుకూలించిన వెంటనే, ఎత్తయిన ప్రదేశాలలో పనిచేయడంలో నైపుణ్యం కలిగిన ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని హెలికాప్టర్ పారాచూట్ ద్వారా దించుతామని చెప్పారు. 

మరోవైపు భారత వాతావరణశాఖ కూడా కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 28 (శుక్రవారం) రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దాదాపు 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమేదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో చమోలి జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. బద్రినాథ్ ధామ్, హనుమాన్‌చట్టి, మలారి, అవులీ లాంటి ఎత్తైన ప్రాంతాల్లో భారీ మంచు కురిసే అవకాశం ఉందని.. మిగతా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

Also Read: Champions Trophy: బ్యాడ్ లక్ ఆఫ్ఘాన్..సెమీస్ కు ఆసీస్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు