అమ్మాయి వలపు వలలో పడి.. పాకిస్థాన్‌కు మిలటరీ సీక్రేట్స్‌ లీక్‌

ఓ అమ్మాయి వలపు వలలో పడి భారత్‌కు చెందిన ఓ వ్యక్తి మన మిలిటరీ రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కు అందిస్తున్నాడనే ఆరోపణలతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Uttar pradesh ordnance factory worker lured by Pakistan agent on Facebook, leaks secrets to ISI

Uttar pradesh ordnance factory worker lured by Pakistan agent

ఓ అమ్మాయి వలపు వలలో పడి భారత్‌కు చెందిన ఓ వ్యక్తి మన మిలిటరీ రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కు అందిస్తున్నాడనే ఆరోపణలతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. అతడు ఇండియన్ ఆర్మీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని అలాగే గగన్‌యాన్‌ ప్రాజెక్టు వివరాలు కూడా అందించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రవీంద్ర కుమార్‌.. ఫిరోజాబాద్‌లోని హజ్రత్‌పుర్‌ ఆర్టినెన్స్‌ ఫ్యాక్టరీలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. 

Also read : ఆ విషయంలో నేనే నంబర్.1.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

2024లో అతడికి నేహా శర్మ అనే ఓ మహిళ ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. వాస్తవానికి ఆమె పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (ISI) కోసం పనిచేస్తోంది. ఈ విషయం రవీంద్రకు తెలియకుండా అతడితో ఆమె స్నేహం చేసింది. డబ్బుల ఆశ చూపించి వలపు వల విసిరి.. మిలిటరీ రహస్యలు సేకరించినట్లు విచారణలో తేలింది. రవీంద్ర ఆమె నెంబర్‌ను చంద్రన్‌ స్టోర్‌కీపర్‌ పేరుతో సేవ్ చేసుకున్నాడు. వాట్సాప్‌లో ఆమెకు కీలకమైన డ్యాకుమెంట్స్‌ పంపించినట్లు పోలీసులు గుర్తించారు. 

Also Read: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హోలికా దహన్‌ ..లక్షలాది కొబ్బరికాయలతో...

51 గోర్ఖా రైఫిల్స్‌ రెజిమెంట్‌ అధికారులు చేసిన లాజిస్టిక్స్‌ డ్రోన్‌ పరీక్షలు, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ, రోజువారీ ఉత్పత్తి వివరాలు, స్క్రీనింగ్‌ కమిటీ పంపిన సీక్రెట్ లేఖలు సంపాందించిన రవీంద్ర.. వాటిని ఆమెకు పంపించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే పాకిస్థాన్‌కు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్‌ఐ సభ్యులతో కూడా అతడు నేరుగా టచ్‌లో ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. అలాగే భారత రక్షణ రంగ ప్రాజెక్టులకు సంబంధించి నిఘా సమాచారాన్ని పంపించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రవీంద్రతో పాటు అతడి స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వాళ్ల వాట్సాప్‌ మెసేజ్‌లను పరిశీలిస్తున్నారు .     

Also Read: వీడేం మనిషండీ బాబు.. పొరుగింటి వారితో గొడవ.. కారుతో ఢీకొట్టడంతో తలకిందులుగా వేలాడిన మహిళ!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴 Pahalgam Terror Attack Live Updates: పహల్గామ్ టెర్రర్ అటాక్.. లైవ్ అప్‌డేట్స్

పహల్గామ్ టెర్రర్ అటాక్ లైవ్ అప్‌డేట్‌లు ఎప్పటికప్పుడు మీ కోసం

author-image
By Krishna
New Update
terror-attack

terror-attack

పహల్గామ్ టెర్రర్ అటాక్ లైవ్ అప్‌డేట్‌లు ఎప్పటికప్పుడు మీ కోసం

  • Apr 27, 2025 19:20 IST

    Sachin Pilot says



  • Apr 27, 2025 19:10 IST

    ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేసీఆర్ నివాళులు



  • Apr 27, 2025 19:01 IST

    మావోయిస్టులతో శాంతి చర్చలు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

    మావోయిస్టులపై కాల్పులు వెంటనే ఆపాలంటూ శాంతి చర్చల కమిటీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందించారు. జానారెడ్డి సలహా మేరకు నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు.

    maoist hyd
    maoist hyd Photograph: (maoist hyd)

     



  • Apr 27, 2025 18:57 IST

    'ఇలా చేయడం కరెక్ట్‌ కాదు'.. కేంద్రాన్ని హెచ్చరించిన జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం..

    పహల్గాం దాడి తర్వాత సామూహిక అరెస్టులు చేయడం, ఇళ్లను కూల్చివేయడంపై జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులెవరో ? పౌరులెవరో ? భేదాలను గుర్తించాలని కేంద్రాన్ని కోరారు. పౌరులకు రక్షణ కల్పించాలని కోరారు.

    Mehbooba Mufti
    Mehbooba Mufti

     



  • Apr 27, 2025 18:44 IST

    కర్ణాటక CM సిద్ధరామయ్యకి పాకిస్తాన్ రత్న.. పాక్ వీదుల్లో ఓపెన్ జీప్‌పై ఊరేగింపు

    భారత్, పాక్‌తో యుద్ధం చేయదన్న సిద్దరామయ్య మాటలు వివాదస్పదమవుతున్నాయి. ఆయనపై BJP లీడర్లు ఫైర్ అవుతున్నారు. సిద్దరామయ్య పాకిస్తాన్ రత్న అని BY విజయేంద్ర అన్నారు. అలా మాట్లాడినందుకు సిద్దరామయ్యను పాక్ వీధుల్లో ఓపెన్ జీప్‌పై ఊరేగిస్తారని ఎద్దేవా చేశారు.

    CM Siddaramaiah responds on Honeytrap in Assembly
    CM Siddaramaiah responds on Honeytrap in Assembly

     



  • Apr 27, 2025 18:44 IST

    భారత్,పాక్ సరిహద్దుల్లో హై టెన్షన్.. అధికారులతో రాజ్‌నాథ్‌ సింగ్‌ ఎమర్జెన్సీ మీటింగ్!

    భారత్, పాక్ సరిహద్దుల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజ్‌నాథ్‌ సింగ్‌తో CDS అనిల్ చౌహన్‌ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. తాజా పరిస్థితులపై చర్చించి.. ఎనీ టైం, ఎనీ వేర్ యుద్ధానికి సిద్ధమంటూ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ ప్రకటించినట్లు తెలుస్తోంది. 

    ind vs pak war
    ind vs pak war Photograph: (ind vs pak war)

     



  • Apr 27, 2025 18:42 IST

    పహల్గాం దాడిని పూర్తిగా షూట్‌ చేసిన వీడియోగ్రాఫర్‌..

    బైసరన్‌కు వచ్చే పర్యాటకుల కోసం రీల్స్‌ను చిత్రీకరించే చేసే ఓ స్థానిక వీడియో గ్రాఫర్‌ ఈ దాడి మొత్తాన్ని తన కెమెరాలో షూట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో NIA అధికారుల వద్ద ఉంది. దీని ఆధారంగా ఈ దాడికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుంటున్నారు.

    Baisaran Reels Videographer, Who Recorded Entire Pahalgam Attack
    Baisaran Reels Videographer, Who Recorded Entire Pahalgam Attack

     



  • Apr 27, 2025 18:42 IST

    పాకిస్తాన్‌లో ఈ నగరాలే భారత్ టార్గెట్.. ఇస్లామాబాద్, కరాచీ, రావల్పిడి!

    పాకిస్తాన్ యుద్ధం కోరుకోవడం లేదని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా మొహమ్మద్ ఆసిఫ్ మీడియాతో అన్నారు. ఇస్లామాబాద్, కరాచీ, రావల్పిండి సిటీపై భారత్ దాడులు చేస్తోందని ఇంటిలిజెన్స్ సమాచారం అందిందని అన్నారు.

    India Vs Pakistan War - Live Updates
    India Vs Pakistan War - Live Updates

     



  • Apr 27, 2025 18:41 IST

    పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు

    ఉగ్రవాదులు పహల్గాం చేరుకునేందుకు దాదాపు 22 గంటల పాటు ట్రెక్కింగ్‌ చేసినట్లు విచారణలో తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నలుగురు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొన్నాయి. ఇందులో ముగ్గురు విదేశీయులు కాగా.. ఒకరు స్థానిక ఉగ్రవాదని చెప్పాయి.



  • Apr 27, 2025 16:45 IST

    విశాఖ వాసుల ఫోన్లలో పాకిస్తాన్ యాప్.. బయటపడ్డ షాకింగ్ విషయాలు!

    పహల్గాం ఉగ్రదాడితో దేశమంతా హై అలర్ట్ నడుస్తోంది. తాజాగా విశాఖపట్నంలో లోన్‌ యాప్‌ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాకిస్థాన్ నుంచి యాప్ ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించగా రూ.200కోట్లు లావాదేవీలు నడుస్తున్నట్లు వెల్లడించారు. 9మందిని అరెస్ట్ చేశారు.

    vishaka
    vishaka Photograph: (vishaka)

     



  • Apr 27, 2025 16:44 IST

    పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?

    భారత్, పాక్ యుద్ధ పరిస్థితుల్లో పాకిస్తాన్‌ దగ్గర 170 న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. వాటిని ప్రయోగించాలంటే ఆ దేశ ప్రధాని, రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలి. వీటి రక్షణ, వినియోగం మాత్రం పాక్ ఆర్మీ చూసుకుంటోంది. ఇండియా దగ్గర 172 అణ్వాయుధాలు ఉన్నాయి.

    nuclear weapons



  • Apr 27, 2025 15:35 IST

    పహల్గాం ఉగ్రదాడిని సపోర్ట్‌ చేస్తూ పోస్టులు.. 19 మంది అరెస్టు

    పహల్గాం ఉగ్రదాడికి మద్దతుగా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఇలా పోస్టులు చేసిన 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్లు అస్సాం, మేఘాలయా, త్రిపురకు చెందిన వాళ్లుగా గుర్తించారు.

    Student, Retired Teachers, Lawyer Among 19 Arrested For Remarks On J&K Attack
    Student, Retired Teachers, Lawyer Among 19 Arrested For Remarks On J&K Attack

     



  • Apr 27, 2025 14:50 IST

    కేంద్రం కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు

    పహల్గాం ఉగ్రదాడి ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ కేసును ఇప్పుడు జమ్మూకశ్మీర్‌ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ తీసుకుంది. ఈ క్రమంలోనే ఎన్‌ఐఏ బృందాలు పహల్గాంలో దర్యా్ప్తు ప్రారంభించాయి.

    NIA takes Pahalgam terror attack Probe
    NIA takes Pahalgam terror attack Probe

     



  • Apr 27, 2025 14:50 IST

    ఇంటిలిజెన్స్ కీలక సమాచారం.. ఢిల్లీలో 5వేల మంది పాకిస్తానీలు

    ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ పౌరుల వివరాలు ఇంటెలిజెన్స్ విభాగం స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు అప్పగించింది. మొత్తం 5వేల మంది పాకిస్తానీలు ఢిల్లీలో నివసిస్తున్నారని.. వారిని వెంటనే పాకిస్తాన్ పంపించే ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఆదేశించారు.

    Pakistanis in Delhi



  • Apr 27, 2025 14:49 IST

    లొంగిపో బిడ్డా.. ఉగ్రవాదిని వేడుకున్న తల్లి.. పరీక్ష రాసేందుకు వెళ్లి!

    పహల్గాం అటాక్‌లో భాగమైన ఉగ్రవాది ఆదిల్‌ను లొంగిపోవాలంటూ తన తల్లి షాజా బానో వేడుకుంటోంది. 2018లో ఇంటినుంచి పరీక్ష రాసేందుకు వెళ్లి తిరిగి రాలేదని ఆందోళన వ్యక్తం చేసింది. తన బిడ్డ అమాయకుడని, తప్పుచేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కన్నీటిపర్యంతమైంది. 

    pehalgam
    pehalgam Photograph: (pehalgam)

     



  • Apr 27, 2025 14:47 IST

    తల్లి ఇండియా.. పసి పిల్లలు పాకిస్థాన్: అటారి సరిహద్దులో కన్నీటి కథ!

    పహల్గాం అటాక్ నేపథ్యంలో అటారి సరిహద్దు వద్ద ఓ భావోద్వేగ సంఘటన చోటుచేసుకుంది. పాక్ పౌరులు తరలివెళ్తుండగా ఓ తల్లికి ఇండియా, ఆమె ఇద్దరు పిల్లలకు పాక్ పాస్ పోర్టులున్నాయి. దీంతో తల్లిని వీడలేక పిల్లలు, పిల్లలను వీడలేక తల్లి కన్నీటిపర్యంతమయ్యారు.

    pak ind
    pak ind Photograph: (pak ind)

     



  • Apr 27, 2025 14:02 IST

    రంగంలోకి ఇండియన్ నేవీ



  • Apr 27, 2025 10:26 IST

    మరో ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన బలగాలు

    ఉగ్రవాదులను వెతికి పట్టుకోవడానికి బారత బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మరో ఉగ్రవాది ఇల్లును పేల్చేశారు. ఫరూఖ్ అహ్మద్ తెడ్వా అనే ఎల్ఈటీ ఇంటిని కాల్చేశారు. 



  • Apr 27, 2025 10:08 IST

     పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్న యావత్ ప్రపంచం

    భారత్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్న అన్ని దేశాలు
    ఉగ్రదాడిని తప్పుబట్టిన అమెరికాకు చెందిన FBI
    భారత్‌కు అండగా ఉంటామన్న FBI డైరెక్టర్ కశ్యప్ పటేల్
    టెర్రరిస్టులపై పోరులో తాము కలిసి వస్తామన్న కశ్యప్ పటేల్
    ప్రపంచ దేశాల ముందు ఏకాకిగా మిగులుతున్న పాకిస్తాన్
    ఇప్పటికే భారత్‌కు మద్దతుగా రంగంలోకి ఇజ్రాయెల్‌ మొసాద్‌ టీం?



  • Apr 27, 2025 08:49 IST

    కశ్మీర్ పై హీరో విజయ్ దేవరకొండ హాట్ కామెంట్స్

    రెట్రో మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో సంచలన వ్యాఖ్యలు
    కశ్మీర్ ఇండియాదే.. కశ్మీరీలు  మనవాళ్లే - విజయ్ దేవరకొండ
    ప్రాపర్‌ ఎడ్యుకేషన్‌ లేక ఇలా బిహేవ్‌ చేస్తున్నారు - విజయ్ దేవరకొండ
    ఆ నాకొడుకులని ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇప్పించాలి  - విజయ్ దేవరకొండ
    వాళ్ల బ్రెయిన్ వాష్ కాకుండా చూసుకోవాలి - విజయ్ దేవరకొండ 
    వాళ్లకే  విరక్తి వచ్చి పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరగబడతారు- విజయ్‌ దేవరకొండ

     ఆ నా కొడుకులకు బుద్ధి లేదంటూ విజయ్ దేవరకొండ కామెంట్స్



  • Apr 27, 2025 08:48 IST

    భారత్‌, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో పెరిగిన ఉద్రిక్తతలు

    LoC వెంట సరిహద్దు గ్రామాలను అలర్ట్ చేసిన అధికారులు
    అట్టారీ బోర్డర్‌లో గ్రామాలను ముమ్మరంగా ఖాళీ చేయిస్తున్న ఆర్మీ
    సరిహద్దు పొలాల వద్దకు ప్రజల వెళ్లొద్దంటూ ఆదేశాలు
    సురక్షిత ప్రాంతాల తరలింపుకు ఏర్పాట్లు
    పాకిస్తాన్‌పై ఆపరేషన్‌కు రెడీ అవుతున్న ఇండియా
    2 రోజుల్లో బిగ్ ఆపరేషన్ జరిగే అవకాశం?



  • Apr 27, 2025 08:20 IST

    ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేసిన భారత ఆర్మీ

    ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేసిన భారత ఆర్మీ

    టెర్రరిస్టుల ఆస్తులను ధ్వంసం చేస్తున్న ఆర్మీ

    తాజాగా మరో ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన ఆర్మీ

    కుర్పారాలోని ఫరూఖ్ అహ్మద్ తెడ్వా ఇల్లు బూడిద

    48 గంటల్లో ఏడుగురు ఉగ్రవాదుల ఇళ్లను నేలమట్టం.. 



  • Apr 27, 2025 08:18 IST

    పహల్గాం దాడికి వ్యతిరేకంగా వ్యక్తి హత్య..2600 మందిని చంపుతామంటూ వీడియో

    ప్రస్తుతం భారతదేశం చాలా సున్నితంగా ఉంది. పహల్గామ్ దాడి అందరిలోనూ ఉద్రేకాన్ని రేపింది. దీని కారణంగా కొంతమంది హద్దుమీరి చర్యలకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో కొంతమంది ఉగ్రదాడి ప్రతీకారం అంటూ ఒక అమాయకుడి ప్రాణాలు తీశారు. 



  • Apr 27, 2025 08:15 IST

    జమ్మూ కశ్మీర్లో మరో దాడికి పాల్పడ్డ టెర్రరిస్టులు!

    పహల్గామ్ ఘటన మరువకముందే టెర్రరిస్టులు మరో దాడికి పాల్పడ్డారు. జమ్మూ కశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో45 ఏళ్ల సోషల్ యాక్టివిస్ట్ రసూల్ మాగ్రేపై ఆయన ఇంట్లోనే కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో రసూల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు