/rtv/media/media_files/2025/02/14/Ujsqz05rShWLItUwuG3d.jpg)
trump and modi 1
సరిహద్దుల్లో చైనాతో ముప్పు పొంచి ఉన్న వేళ..భారత రక్షణరంగాన్ని మరింత బలోపేతం చేసేలా కీలక ప్రకటన వెలువడింది. ఢిల్లీకి అధునాతన ఎఫ్ 31 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ..ఆయనతో భేటీ అయిన సంగతి తెలిసిందే.
Also Read:Trump: ముంబయి దాడుల సూత్రధారి అప్పగింతకు ట్రంప్ అంగీకారం!
ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య, దౌత్య సంబంధాలు, రక్షణ రంగంలో పరస్పర సహకారం వంటి అంశాల పై దేశాధినేతలు చర్చించుకున్నారు. అనంతరం వీరిద్దరూ కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
అమెరికా-భారత్ కోసం అద్భతమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోతున్నాం. సమీప భవిష్యత్తులో భారీ ఒప్పందాన్ని ప్రకటిస్తాం. అమెరికాలో ఉత్పత్తి అయ్యే చమురు, గ్యాస్ ను భారత్ కొనుగోలు చేస్తుంది. ఈ ఏడాది నుంచి భారత్ కు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను పెంచుతాం. ఎఫ్ 35 స్టెల్తా ఫైటర్ జెట్లను కూడా విక్రయించేంఉదకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ వెల్లడించారు.
ద్వైపాక్షిక వాణిజ్యమే...
అనంతరం మోడీ మాట్లాడుతూ..ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం త్వరలోనే జరుగుతుందని విశ్వసిస్తున్నాం.అమెరికాలో చమురు,గ్యాస్ వాణిజ్యం పైనా దృష్టిపెడతాం. 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యమే మా లక్ష్యం అని తెలిపారు.
రష్యా -ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా ఉద్రిక్తతలను గురించి మోడీ మాట్లాడారు. యుద్ధం విషయంలో భారత్ ది తటస్థ వైఖరి కాదు. మేం శాంతి వైపు నిలబడతాం. ఇది యుద్ధాల శకం కాదని ఇది వరకే రష్యా అధ్యక్షుడు పుతిన్ కు చెప్పా. ఉద్రిక్తతలను ఆపడానికి ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు మద్ధతిస్తున్నా అని మోడీ వెల్లడించారు.
ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లారు. దీని నుంచి స్ఫూర్తి పొందుతూ తాను కూడా మేక్ ఇండియా గ్రేట్ అగైన్ నినాదం ఇస్తున్నట్లు మోడీ ఈ సందర్భంగా తెలిపారు. మెగా,మిగా కలిస్తే మెగా భాగస్వామ్యం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read: Fastag: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్..ఫిబ్రవరి 17 నుంచి కొత్త రూల్స్!
Also Read: Telangana: తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిన విషయం నిజమే..నిర్మలా సీతారామన్!