Cat: పెంపుడు పిల్లి మృతి.. యజమానురాలు చేసిన పనికి అంతా షాక్‌

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. పెంపుడు పిల్లి మరణించిందని దాని యజమానురాలు తీవ్రంగా మనస్తాపం చెందింది. రెండ్రోజుల పాటు పిల్లి మృతదేహంతో గడిపి సూసైడ్ చేసుకుంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Womans Cat Dies She Keeps Body For 2 Days Then Kills Herself In Uttar Pradeshs Amroha

Womans Cat Dies She Keeps Body For 2 Days Then Kills Herself In Uttar Pradeshs Amroha

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. పెంపుడు పిల్లి మరణించిందని దాని యజమానురాలు తీవ్రంగా మనస్తాపం చెందింది. రెండ్రోజుల పాటు పిల్లి మృతదేహంతోనే గడిపింది. చివరకు తాను కూడా ఆత్మహత్య చేసుకొని మరణించింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.  ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని హసన్‌పూర్‌ ఉంటున్న పూజ(32) అనే మహిళకు 8 ఏళ్ల క్రితం ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తితో పెళ్లైంది. 

Also Read: ఇంత స్పీడున్నారేంట్రా బాబు- నాలుగు నిమిషాల్లో ATM లూటీ.. లక్షల్లో దోచేసి..!

అయితే రెండేళ్ల తర్వాత వాళ్లిద్దరూ విడిపోయారు. అప్పటినుంచి పూజ తన తల్లి గజ్రా దేవి ఇంట్లోనే ఉంటోంది. ఒంటరిగా రోజులు గడపాల్సి రావడంతో పూజ ఒక పిల్లిని పెంచుకుంది. ఫిబ్రవరి 25న ఆ పిల్లి మృతి చెందింది. దీంతో దాన్ని పూడ్చిపెట్టాలని పూజకు ఆమె తల్లి చెప్పింది. కానీ పూజ మాత్రం వినలేదు. తన పిల్లి బతుకుతుందని వాదించింది. రెండ్రోజుల పాటు పిల్లిమృతదేహంతోనే గడిపింది.  

Also Read: హిందువుగానే పుట్టా.. అలాగే చనిపోతా : డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ !    

చివరికీ తన పిల్లి ఇక లేదని గ్రహించి తీవ్ర మనస్తాపం చెందింది. మార్చి 1న రాత్రికి తన గదిలో డోర్‌ లాక్‌ చేసుకుంది. సీలింగ్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అదే గదిలో నేలపై చనిపోయిన పిల్లి మృతదేహం కూడా ఉంది. ఇది చూసిన పూజ తల్లి ఒక్కసారిగా షాక్‌ అయిపోయిది. స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఇక సమాచారం మేరకు పోలీసులు ఆ ఇంటికి వచ్చి పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

Also Read: ట్రంప్ దెబ్బకు అబ్బా అంటున్న ట్రాన్స్‌జెండర్లు.. భారత్‌లోనూ మూతపడ్డ ఆ క్లినిక్‌లు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు