/rtv/media/media_files/2025/02/10/wX6GmPSF6T7YkztKPDCJ.jpg)
kumbhtraffic
ఓ పది నిమిషాల పాటు ట్రాఫిక్ లో ఉంటేనే...అబ్బా ఏంటీ మోత అంటూ చిరాకు పడిపోతాం. అలాంటిది ఏకంగా 48 గంటల పాటు నడిరోడ్డు మీద వాహనంలోనే ఉండిపోతే ఆ కష్టం చెప్పలేనిది.ఈ పరిస్థితి కుంభమేళాకు వస్తున్న యాత్రికులకు ఎదురవుతుంది. గత మూడు రోజులుగా కుంభమేళాకు లక్షలాది మంది తరలి వస్తున్నారు. జబల్ పూర్-ప్రయాగ్ రాజ్ మార్గంలోని జాతీయ రహదారి పై సుమారు 350 కి.మీ పొడవున వాహనాలు ఆగిపోయి మోత చేస్తున్నాయి.
ఈ ఘటన ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్ (Traffic Jam) గా చరిత్ర పుటలకు ఎక్కింది.మరో 48 గంటల పాటు ఎవరూ ప్రయాగ్ రాజ్ కు వెళ్లొద్దని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకోవచ్చు.
Also Read: Up: కుంభమేళా ఎఫెక్ట్..వాయిదా పడుతున్న హైకోర్టు కేసులు!
త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిద్దామని మధ్యప్రదేశ్‌లోని చింద్వాడా నుంచి శనివారం ఉదయం బయల్దేరిన ఓ ఫ్యామిలీ మూడున్నర గంటల్లో జబల్ పూర్ చేరుకుంది. అక్కడి నుంచి ప్రయాగ్ రాజ్‌కు ఆదివారం ఉదయానికి చేరుకుంది.
ఆ తరువాత ట్రాఫిక్ మరింత అస్తవ్యస్తం కావడంతో తిరుగు ప్రయాణం చేయలేక ఆదివారం రాత్రికి కూడా అక్కడే ఉండిపోయింది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ,కర్ణాటక,మహారాష్ట్ర నుంచి బయల్దేరిన భక్తులూ ఈ మార్గంలో వెళ్తూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ప్రయాగ్‌రాజ్ వైపు వెళ్లొద్దని...
మధ్య ప్రదేశ్ (Madhya Pradesh) నుంచి వెళ్లే మార్గాల్లో వాహనాల రద్దీ దృష్ట్యా ..రాబోయే రెండు రోజుల పాటు ప్రయాగ్‌రాజ్ వైపు వెళ్లొద్దని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ యాత్రికులకు సూచించారు. ట్రాఫిక్ పరిస్థితులను గూగుల్ లో చూసుకుంటూ ముందుకు సాగాలన్నారు. మధ్య ప్రదేశ్‌లోని జబల్ పుర్, సివనీ,హైహర్, సాత్నా, రివా జిల్లాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ లు అవుతున్నాయి.
Also Read: Trump: ట్రంప్ నిర్ణయంతో హెచ్‌ఐవీ మరణాలు 63 లక్షలు పెరుగుతాయంటున్న ఐరాస...!
50 కి.మీ మేర దూరానికే 12 గంటల సమయం పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రయాగ్‌రాజ్ (Prayagraj) కు వెళ్లే మార్గాల్లో భారీ ట్రాఫిక్ జామ్ చోటు చేసుకోవడం పై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారుల పై చిక్కుకున్న లక్షల మంది భక్తులు ఆకలి, దాహంతో ఇబ్బంది పడుతున్నారంటూ యూపీ ప్రభుత్వం పై విమర్శలు చేశారు.