ఐస్‌క్రీం విక్రేత తల నరికిన దుండగుడు.. తెగిన తలతో ఇంటికెళ్లి వంట చేసుకున్న ఉన్మాది

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ దుండగుడు ఐస్‌క్రీం వ్యాపారి తల నరకడం కలకలం రేపింది. ఆ తర్వాత ఆ తలను తీసుకొని తన ఇంటికి వెళ్లాడు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

New Update
Man Beheads Ice-Cream Seller, Carries His Head Home in uttarpradesh

Man Beheads Ice-Cream Seller, Carries His Head Home in uttarpradesh

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ దుండగుడు ఐస్‌క్రీం వ్యాపారి తల నరకడం కలకలం రేపింది. ఆ తర్వాత ఆ తలను తీసుకొని తన ఇంటికి వెళ్లాడు.  ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. బారాబంకీ జిల్లాలో బబ్లు(25) అనే వ్యక్తి ఐస్‌క్రీంలు అమ్ముతూ జీవిస్తున్నాడు. అయితే శనివారం ఎప్పట్లాగే ఐస్‌క్రీంలు అమ్మేందుకు సైనికల్‌పై పర్సవాల్ అనే గ్రామానికి వెళ్లాడు. ఈ గ్రామంలో శంకర్ యాదవ్ (50) అనే వ్యక్తితో బబ్లూకి మధ్య వాగ్వాదం జరిగింది.  

Also Read: జైలులో మొబైల్‌ ఫోన్లు, టీవీ వాడుతున్న ఖైదీలు.. సిబ్బందిపై వేటు

ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శంకర్‌ యాదవ్‌.. బబ్లూపై కొడవలితో దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే అతడి తల నరికేశాడు. ఆ తర్వాత నరికిన తలను పట్టుకొని నేరుగా తన ఇంటికి వెళ్లాడు. ఇది చూసిన స్థానికులు షాకైపోయారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. శంకర్‌ యాదవ్‌ ఇంటికి వెళ్లగా.. అతడు ఇంట్లో వంట చేసుకుంటూ కనిపించాడు. నరికిన బబ్లూ తల కూడా అతని పక్కనే ఉండటం చూసి పోలీసులు కంగుతిన్నారు.  

Also Read: హోర్ముజ్ జలసంధి వద్ద అలజడి..ఖార్గ్ ఐలాండ్‌ ను స్వాధీనం చేసుకున్న అమెరికా

చివిరికి శంకర్ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు తల నరకడానికి వాడిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బబ్లూ మృతదేహాన్ని, తలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే బాధితుడు బబ్లూకు భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. 

Advertisment
తాజా కథనాలు