/rtv/media/media_files/2025/03/27/cJxRHa5Hoo4ETH1pwjxp.jpg)
husband-and-wife
ఉత్తరప్రదేశ్‌లోని వింత ఘటన చోటుచేసుకుంది. సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఓ భర్త తన భార్యకు రెండో పెళ్లి చేశాడు. తన భార్య వివాహేతర సంబంధాన్ని అంగీకరించడమే కాకుండా, ఇద్దరు పిల్లల బాధ్యతను కూడా తానే స్వయంగా తీసుకున్నాడు. తన పనుల కారణంగా బబ్లూ తరచుగా భార్యకు దూరంగా ఉండేవాడు. ఆ సమయంలో అతని భార్య రాధిక స్థానిక యువకుడైన వికాస్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ వార్త యూపీలో హట్ టాపిక్‌గా మారింది.
Also Read : 2027 నాటికి 23 లక్షల ఉద్యోగాలు ఊడిపోతాయ్..!
🚨 संतकबीरनगर: पति ने पत्नी की प्रेमी से करवा दी शादी 🚨
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) March 26, 2025
😲 चौंकाने वाली घटना सामने आई
💔 पति ने कहा- "तुम जाओ, बच्चों को मैं खुद पाल लूंगा"
🏠 धनघटा थाना क्षेत्र के गांव का मामला#SantKabirNagar #ShockingNews #Marriage #LoveTriangle #FamilyDrama pic.twitter.com/3UcgUPn218
Also Read : వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం!
వికాస్‌తో పరిచయం, అక్రమ సంబంధం
కతర్ జోట్ గ్రామానికి చెందిన బబ్లూ 2017లో గోరఖ్‌పూర్‌కు చెందిన రాధికను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు - ఆర్యన్ (7), శివాని (2) జన్మించారు. పనిపనుల కారణంగా బబ్లూ తరచుగా బయట ప్రదేశాలకు వెళ్లేవాడు. ఆ సమయంలో రాధికకు స్థానిక యువకుడైన వికాస్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం ఇది అక్రమ సంబంధానికి దారి తీసింది. ఆ సంబంధం చాలా కాలం పాటు కొనసాగింది. ఆ తర్వాత బబ్లూకు ఈ విషయం తెలిసింది.
Also Read : దేశవ్యాప్తంగా ఫోన్ పే..గూగుల్ పే బంద్..ఎందుకో తెలిస్తే షాక్..
ఆ తర్వాత బబ్లూ ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాడు. తాను ఎలాగూ తన భార్యకు సమయం కేటాయించలేకపోతున్నానని.. తన భార్య ఇష్టపడిన వ్యక్తితోనే ఇచ్చి రెండో పెళ్లి చేయాలని భావించాడు. అతను మొదట కోర్టుకు వెళ్లి తన భార్య, ఆమె ప్రేమికుడికి వివాహాన్ని ఘనంగా జరిపించాడు, ఆపై వారిని ఒక ఆలయానికి తీసుకెళ్లాడు. అక్కడ వారు దండలు మార్చుకున్నారు. ఇక తనకు పుట్టిన ఇద్దరు పిల్లల్ని కూడా తనతోనే ఉంచుకుంటానని వారి బాధ్యతలు తానే తీసుకుంటానని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also read : బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి జగన్ శుభవార్త.. కీలక పదవి!
husband | wife | viral-video | uttar-pradesh | telugu viral videos | viral video telugu | latest-telugu-news | today-news-in-telugu