National: బీజేపీకి రాహుల్ గాంధీ మద్దతు.. సీఎం  యోగి సంచలన కామెంట్స్!

రాహుల్ గాంధీ బీజేపీకి మేలు చేస్తున్నారని యూపీ సీఎం యోగి అన్నారు. ఆయన విదేశాల్లో దేశంపట్ల వ్యవహరిస్తున్న తీరు, మాటలు బీజేపీకే మేలు చేస్తున్నాయని చెప్పారు. రాహుల్ ఉద్దేశం, స్వభావం ఏమిటో దేశ ప్రజలకు అర్థమైందన్నారు. 

New Update
yogi rahul

UP CM Yogi shocking comments on Rahul Gandhi

National: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీకి మేలు చేస్తున్నారని యూపీ సీఎం యోగి అన్నారు. విదేశాల్లో రాహుల్‌ భారత దేశం గురించి మాట్లాడుతున్న తీరు చూస్తే అలాగే అనిపిస్తోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాలు తిరుగుతున్న రాహుల్ మాతృదేశం గురించి చులకనగా మాట్లాడతారని, ఆయన ఉద్దేశం ఏంటో ప్రజలకు స్పష్టంగా అర్థమైందంటూ విమర్శలు గుప్పించారు. 

దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు..

ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యోగి.. విభజన రాజకీయాల్లో భాగంగానే రాహుల్ జోడో యాత్ర చేపట్టారని చెప్పారు.  విదేశాల్లో స్వదేశాన్ని విమర్శిస్తుంటారన్నారు. రాహుల్ ఉద్దేశం, స్వభావం ఏమిటో దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆయన మాటలు, దేశంపట్ల వ్యవహరిస్తున్న తీరు బీజేపీకే మేలు చేస్తుందని చెప్పారు. అలాగే రాజకీయ ప్రయోజనాల కోసం సున్నితమైన అంశాలను కాంగ్రెస్ పొడిగించడం దారుణం అన్నారు. 

Also Read :  ఛోక్సీ మా దేశంలోనే ఉన్నాడు: బెల్జియం!

లోక్ సభ ఎన్నికల్లోనూ ‘కాంగ్రెస్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిందని ఫైర్ అయ్యారు యోగి. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు జార్జి సోరస్‌ డబ్బును ఉపయోగించిందని ఆరోపించారు. విదేశీ డబ్బును ఉపయోగించడం దేశ ద్రోహం కాదా అంటూ ప్రశ్నించారు. ఇక ట్రిపుల్ తలాక్‌ను కాంగ్రెస్ ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. కుంభమేళా కోసం ఎందుకు ప్రచారం చేయలేదు?  దేశానికి మౌలిక సదుపాయాలను ఎందుకు కల్పించలేదంటూ మండిపడ్డారు. 

Also Read: పోలీసుస్టేషన్‌ లోనే భర్త ముఖం పగలకొట్టిన ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ ఛాంపియన్!

 cm-yogi-adityanath | rahul-gandi | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment