/rtv/media/media_files/2026/05/18/up-cm-yogi-adityanath-warns-against-offering-namaz-on-road-2026-05-18-18-29-45.jpg)
UP CM Yogi Adityanath warns against offering namaz on road
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రోడ్లపై నమాజ్ చేసే అంశంపై ముస్లింలకు హెచ్చరిక జారీ చేశారు. లక్నోలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో ఇకనుంచి ముస్లింలు రోడ్లపై నమాజ్ చేయకూడదని ఆదేశించారు. ఒకవేళ ఇలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. రోడ్లు అనేవి రవాణా సౌకర్యం కోసమేనని.. ప్రజల రాకపోకలను, ట్రాఫిక్‌ను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని తెలిపారు. చట్టం అందరికీ సమానమేనని, ప్రభుత్వ రూల్స్‌ను ప్రతి ఒక్కరూ గౌరవించాలంటూ వ్యాఖ్యానించారు.
Also Read: సామాన్యులకు దెబ్బ మీద దెబ్బ.. భారీగా పెరగనున్న కరెంట్ ఛార్జీలు.. ఎంతో తెలుసా?
ప్రార్థనలు చేసుకునేందుకు ఇంట్లో స్థలం సరిపోవడం లేదని కొందరు ముస్లింలు సాకులు చెబుతుంటారని అన్నారు. స్థలం లేకపోతే దానికి అనుగుణంగా జనాభాను తగ్గించుకోవాలని సూచించారు. అంతేగాని రోడ్ల మీదకు వచ్చి నమాజ్ చేయకూడదని హెచ్చరించారు. నమాజ్ చేసుకోవడం తప్పనిసరి అయితే షిఫ్టుల వారీగా సమయాన్ని సర్దుబాటు చేసుకుని ప్రార్థనలు చేసుకోవాలన్నారు. దీనికి ప్రభుత్వం అడ్డు చెప్పదన్నారు. కానీ రోడ్లను మాత్రం వాడుకోనివ్వబోమని తేల్చిచెప్పారు.
Also Read: నీట్ పేపర్ లీక్ వెనుక బ్యుటీషియన్.. వెలుగులోకి సంచలన నిజాలు
ఇటీవల పశ్చిమ బెంగాల్ పర్యటన సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటించిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా ఆయన జనాభా నియంత్రణ, రోడ్లపై నమాజ్‌ల గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ యోగీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. తాజాగా యూపీలో ఈ రూల్స్‌ను కఠినంగా అమలు చేస్తామని చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యోగీ తీసుకున్న ఈ నిర్ణయంపై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
नमाज पढ़नी है, आप शिफ्ट में पढ़िए...
— Yogi Adityanath (@myogiadityanath) May 18, 2026
प्यार से मानेंगे ठीक है, नहीं मानेंगे तो दूसरा तरीका अपनाएंगे... pic.twitter.com/zDoz6YiqTZ
Follow Us