/rtv/media/media_files/2025/03/21/fl7yNWf6l9OufuwFGklG.jpg)
Union Minister Nityanand Rai
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సోదరి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన ఇద్దరు మేనల్లుళ్ల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. అలాగే మృతుడి సోదరుడు, అతని తల్లీ తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని భాగల్‌పుర్ సమీపంలోని జగత్‌పుర్ గ్రామంలో గురువారం ఉదయం ఈ కాల్పులు జరిగాయి.
Also Read: ఆపరేషన్ హిడ్మా.. 125కు పైగా గ్రామాలను చుట్టుముట్టిన బలగాలు.. అడవిలో హైటెన్షన్!
నిత్యానందరాయ్ మేనల్లుళ్లు జయ్‌జిత్ యాదవ్, విశ్వజిత్ యాదవ్ మధ్య కొళాయి నీళ్లు పట్టే విషయంలో వివాదం చెలరేగింది. దీంతో ఆ గొడవ పెద్దదై చివరకు కాల్పులచేసుకునే దాకా దారితీసింది. ఈ ఘటనలో విశ్వజిత్ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదుచేసుకొని దీనిపై విచారణ చేపట్టారు.
Also Read: వేలంలో రూ.118 కోట్లు పలికిన ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్.. ఇందులో అంత ప్రత్యేకత ఏంటో తెలుసా?
ఈ గొడవలో జయ్‌జిత్‌తో పాటు అతని తల్లి, సోదరులు తీవ్రంగా గాయపడ్డట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వాళ్లకి ఆస్పత్రిలో చికిత్స జరుగుతోందని చెప్పారు. అయితే కేంద్రమంత్రి అల్లుళ్ల మధ్య చాలాకాలం నుంచి సంబంధాలు సరిగా లేవని తెలుస్తోంది. ఇదిలాఉండగా.. కేంద్రమంత్రి ఇంట్లో ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
Also Read: వికలాంగురాలిపై లైంగిక దాడి చేయించిన భర్త.. ఒకేసారి ఐదుగురు కలిసి!
Also Read: మరో డిజిటల్ అరెస్టు .. రూ.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
rtv-news | national-news | crime-news