/rtv/media/media_files/2025/01/13/VhvxNvd83WRmqGOOde7q.jpg)
Mark Zucker Berg and Ashwini vaishnaw Photograph: (Mark Zucker Berg and Ashwini vaishnaw)
ఇటీవల మెటా సీఈవో మార్క్‌జూకర్ బర్గ్ ఓ పోడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గతేడాది జరిగిన ఎన్నికల్లో భారత్‌తో సహా అనేక దేశాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓడిపోయాయని తెలిపారు. అయితే జూకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్ వేదికగా స్పందించారు. జూకర్‌బర్గ్ తప్పుగా చెప్పారని పేర్కొన్నారు. భారత్‌లో ప్రజలు ఎన్డీయేపై విశ్వాసంతో మూడోసారి గెలిపించారని గుర్తుచేశారు.
Also Read: దేవుళ్లు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగితే.. కుంభమేళ ఎందుకొచ్చిందంటే..?
'' ప్రపంచంలో అతిపెద్ద ప్రజస్వామ్య దేశమైన భారత్‌లో జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల్లో 64 కోట్ల మంది ఓటు వేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉంది. కరోనా తర్వాత భారత్‌తో పాటు వివిధ దేశాల్లో అధికారాల్లో ఉన్న ప్రభుత్వాలు ఓడిపోయాయని జూకర్‌బర్గ్ తప్పుగా చెప్పారు.
Also Read: అసలు మనిషేనా వీడు.. గిరిజన విద్యార్థినులు చేత టాయిలెట్లు కడిగించాడు!
భారత ప్రభుత్వం 80 కోట్ల మందికి ఉచిత ఆహారం అందించింది. 220 కోట్ల వ్యాక్సిన్లు అందించింది. అలాగే కరోనా సమయంలో ప్రపంచ దేశాలకు సాయం చేసింది. ఈ నిర్ణయాల వల్లే మోదీ మూడోసారి విజయం సాధించారని'' అశ్వినీ వైష్ణవ్ ఎక్స్‌లో తెలిపారు. జూకర్‌బర్గ్ అలా మాట్లాడటం నిరాశకు గురిచేసిందని.. వాస్తవాలను, విశ్వసనీయతను కాపాడుకుందామని మెటాను టాగ్ చేస్తూ పోస్టు చేశారు.
As the world’s largest democracy, India conducted the 2024 elections with over 640 million voters. People of India reaffirmed their trust in NDA led by PM @narendramodi Ji’s leadership.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 13, 2025
Mr. Zuckerberg’s claim that most incumbent governments, including India in 2024 elections,…
Also Read: గత 48 గంటల్లో 85 లక్షల మంది పుణ్యస్నానాలు.. చరిత్రలో అతి పెద్ద ఉత్సవంగా కుంభమేళ
Also Read: ఒక దేశ జనాభా అంత జనం.. 6 పార్లమెంట్లు కట్టే అంత ఖర్చు.. కుంభమేళా హైలైట్స్ ఇవే!