UNION BUDGET 2025: నిర్మలమ్మ గుడ్ న్యూస్.. టీవీలు, ఫోన్లు, బట్టలతో పాటు తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే!

కేంద్ర బడ్జెట్‌‌లో మొబైల్, టీవీతో పాటు మరికొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. చేనేత వస్త్రాలు, తోలు వస్తువులు, వైద్య పరికరాలు, క్యాన్సర్ వంటి అరుదైన వ్యాధులకు వాడే మందులు, ఖనిజాల ధరలు తగ్గుతాయి. మొత్తం 82 వస్తువులపై ప్రభుత్వం సెస్‌ను తొలగించనుంది.

New Update
income tax

Prices decreased

కేంద్ర బడ్జెట్‌ 2025 సామాన్యులకు ఊరట ఇచ్చింది. మొబైల్, టీవీ, ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో పాటు మరికొన్ని వస్తువుల ధరలను తగ్గించనున్నట్లు తెలిపింది. చేనేత వస్త్రాలు, తోలు వస్తువులు, వైద్య పరికరాలు, క్యాన్సర్ వంటి అరుదైన వ్యాధులకు వాడే మందులు, పలు రకాల ఖనిజాలు, భారత్‌లో తయారయ్యే వస్తువుల ధరలు అన్ని కూడా తగ్గనున్నాయి. ప్రభుత్వం మొత్తం 82 వస్తువులపై సెస్‌ను తొలగించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 36 క్యాన్సర్ మందులు తక్కువ ధరకే లభిస్తాయి. 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు