/rtv/media/media_files/2026/03/07/cm-mamata-benarjee-2026-03-07-20-30-59.jpg)
CM Mamata Benarjee
పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో అధికార, విపక్ష పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. యువ సాథి అనే స్కీమ్ కింద రాష్ట్రంలో 10వ తరగతి పాసైన నిరుద్యోగులకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. మార్చి 7 నుంచే నుంచే నిరుద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుందని చెప్పారు.
Also Read: రష్యా నుంచి చమురు కొనేందుకు భారత్‌కు అమెరికా పర్మిషన్ ? ఇందులో వాస్తవం ఎంత..
ఈ పథకాన్ని ముందుగా ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని భావించినట్లు చెప్పారు. మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తేదీల్లో మార్పులు చేశామన్నారు. కోల్‌కతాలో సర్‌కు వ్యతిరేకంగా జరిగిన ధర్నాలో దీదీ మాట్లాడారు. తమ పాలనలో బెంగాల్‌లో నిరుద్యోగుల రేటు 40 శాతం తగ్గినట్లు చెప్పుకొచ్చారు. దాదాపు 40 లక్షల మందికి స్కిల్ ట్రైనింగ్ అందించామని.. వాళ్లలో 10 లక్షల మంది ఇప్పటికే ఉపాధి పొందుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తమ ప్రభుత్వం ఇప్పటికే ప్రతీ ఏడాది రూ.10 వేలు అందిస్తోందని తెలిపారు. అంతేకాదు రాష్ట్రంలో చాలా ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందకు ఆసక్తి చూపిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read: వార్ దెబ్బ.. దుబాయ్‌లో బంగారంపై భారీ డిస్కౌంట్.. ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
మరోవైపు తమిళనాడులోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ చీఫ్, హీరో విజయ్ కూడా మహిళల సంక్షేమం కోసం మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళలకు ప్రతీ నెల రూ.2500 నగదును అందిస్తామన్నారు. గృహిణులకు ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని తెలిపారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రతీ పెళ్లికి 8 గ్రాముల బంగారం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మహిళల ప్రయాణ సౌకర్యం కోసం రాష్ట్రంలో ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. అంతేకాదు మహిళల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ ఉచిత శానిటరీ నాప్కిన్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు.
Follow Us