Udhayanidhi : తమిళనాడు ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఈసారి ఎన్నికల్లో ఘోర పరాజయం దిశగా పయనిస్తోంది. అక్కడ విజయ్ టీఎంకే పార్టీ అధికారం దిశగా అడుగులు వేస్తుండగా, ఏఐడీఎంకే రెండవ స్థానంతో ప్రతిపక్ష హోదాను దక్కించుకునే అవకాశం కనపడుతుంది. ఇక అధికార డీఎంకే మూడో స్థానానికి పడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారంలో ఉన్నపుడు స్టాలిన్ తనయుడు, ఉప ముఖ్యమంతి ఉదయనిధి స్టాలిన్ చేసిన పలు వివాదస్పద వ్యాఖ్యలు స్టాలిన్ ఓటమికి కారణమయ్యాయనే ప్రచారం సాగుతోంది.
తమిళనాడు రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఉదయనిధి స్టాలిన్ 'సనాతన ధర్మం' వ్యాఖ్యల కేసు ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. ఒకవైపు న్యాయస్థానాల్లో విచారణలు, మరోవైపు రాజకీయ విమర్శల నడుమ సాగిన ఎన్నికల్లో ఆ పార్టీ అధికారం కోల్పొయే పరిస్థితికి దారితీసింది.
వివాదం నేపథ్యం (సెప్టెంబర్ 2023)
2023లో జరిగిన ఒక సదస్సులో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, "సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా, కరోనా వంటిదని, దానిని కేవలం వ్యతిరేకించడం సరిపోదని, నిర్మూలించాలంటూ" తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హిందూ ధార్మిక సంస్థలు , బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నాయి. డిఎంకె (DMK) హిందూ వ్యతిరేక పార్టీ అనే ముద్ర వేయడానికి బీజేపీకి ఇది ఒక ప్రధాన ఆయుధంగా మారింది. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. మద్రాస్ హైకోర్టులో దాఖలైన 'క్వో వారంటో' (Quo Warranto) రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు కీలక వాదనలు వినిపించారు. మంత్రిగా పదవీ ప్రమాణం చేసిన వ్యక్తి, ఒక నిర్దిష్ట వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారా రాజ్యాంగాన్ని "మోసం" చేశారని న్యాయవాది టి.వి. రామానుజం వాదించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి సమాజంలో విద్వేషం నింపేలా మాట్లాడటం వల్ల ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత కోల్పోయారని పిటిషనర్ తరపున వాదనలు వినిపించారు.
రాజకీయ ప్రభావం (2024 - 2026)
రాజకీయంగా ఈ వివాదం స్టాలిన్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక ఇబ్బందులను తెచ్చిపెట్టింది. తన కుమారుడి వ్యాఖ్యలను సమర్థించలేక, అలాగని వదులుకోలేక ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్ర రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ,2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్ని బీజేపీ ప్రధానంగా ప్రచార అస్త్రంగా వాడుకుంది. మరోవైపు నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడం, ఈ ట్రెండ్స్ మారుతున్న తరుణంలో ఉదయనిధి వ్యాఖ్యలు పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీశాయనే ఆరోపణలున్నాయి.
అయితే దీనిపై ఉదయనిధి తన వ్యాఖ్యలపై ఉదయనిధి వివరణ ఇస్తూ.. తాను కేవలం సామాజిక అసమానతల గురించి మాత్రమే మాట్లాడానని, తన ప్రసంగాన్ని వక్రీకరించారని పేర్కొన్నప్పటికీ, వివాదం మాత్రం సద్దుమణగలేదు. ఎన్నికల్లో దీని ప్రభావం చాలా స్పష్టంగా కనిపించింది.
Udhayanidhi : స్థాలిన్‌ను దెబ్బకొట్టిన ఉదయనిధి 'సనాతన ధర్మం' వ్యాఖ్యలు
తమిళనాడు ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఈసారి ఎన్నికల్లో ఘోర పరాజయం దిశగా పయనిస్తోంది. స్టాలిన్ తనయుడు, ఉప ముఖ్యమంతి ఉదయనిధి స్టాలిన్ చేసిన పలు వివాదస్పద వ్యాఖ్యలు స్టాలిన్ ఓటమికి కారణమయ్యాయనే ప్రచారం సాగుతోంది.
Tamil Nadu CM MK Stalin and son Udhayanidhi