ఎంతకు తెగించార్రా, సినిమా తరహా దొంగతనం.. అమెజాన్ కే రూ.కోట్లలో కన్నం!

రాజస్థాన్ కు చెందిన రాజ్ కుమార్, సుభాష్ అమెజాన్ కు రూ. కోటికి పైగా దెబ్బేశారు. ఆన్ లైన్ లో హై అండ్ లో కాస్ట్ వస్తువులు ఆర్డర్ చేసి.. ఎక్కువ ధర స్టిక్కర్ ను తక్కువ ధరకు పెట్టేవారు. తర్వాత ఎక్కువ ధర వస్తువు రిటర్న్ పెట్టి డబ్బులు దోచేశారు.

New Update
Two Rajasthani men arrested

నేటి సమాజంలో చాలా మంది కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి కొందరు దొడ్డిదారులు తొక్కుతున్నారు. ఏం చేసైనా డబ్బులు దోచేద్దామనే ఆలోచిస్తున్నారు. మన దేశంలో ఇటువంటి కేటుగాళ్లు ఎక్కువైపోయారు. అదీగాక టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ డబ్బులు ఈజీగా కొట్టేస్తున్నారు. టెక్నాలజీకి తోడు కాస్త ఆలోచనకు పదును పెట్టి కోట్లలో కాజేస్తున్నారు. ఆపై పోలీసులకు చిక్కి కటకటాల పాలవుతున్నారు. 

8 రాష్ట్రాల్లో మోసాలు

Also Read :  హీరో విజయ్ దేవరకొండకు ప్రమాదం.. VD12 షూటింగ్ లో అలా..!

తాజాగా అలాంటిదే ఒకటి జరిగింది. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో పక్కా ప్లాన్ వేశారు. ప్లాన్ ప్రకారం అమెజాన్ కు కోట్లలో కన్నం వేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడ్డారు. ఆఖరికి పోలీసులకు చిక్కారు. ఇంతకీ ఏం చేశారు. అమెజాన్ కు కోట్లలో కన్నం ఎలా వేశారు? అనే విషయానికొస్తే.. 

ఫేక్ ఐడీస్ తో ఆర్డర్

Also Read :  ఛీ..ఛీ.. స్కూల్‌లోనే టీచర్ పాడు పని!

రాజస్థాన్ కు చెందిన రాజ్ కుమార్, సుభాష్ గుర్జార్ అనే ఇద్దరు యువకులు పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. అమెజాన్ నుంచి కొన్ని ప్రొడెక్టులను విడి విడిగా ఆర్డర్ చేసేవారు. వాటిలో ఎక్కువ ధర ప్రొడెక్టులు కొన్ని, తక్కువ ధర ప్రొడెక్టులు కొన్ని ఉండేలా చూసుకునేవారు. ఆ ప్రొడెక్టులను ఫేక్ ఐడీస్ తో ఆర్డర్ చేసేవాళ్లు. అయితే అంత వరకు బాగానే ఉంది. కానీ ఆ వస్తువుల డెలివరీ చేసే సమయంలో డెలివరీ బాయ్ లను తిరకాసు చేసేవారు. 

స్టిక్కర్లు ఛేంజ్

Also Read :  క్షమాపణ చెప్పాకే రావాలి.. రాహుల్: KTR

ఆర్డర్ అందుకుంటున్న సమయంలో డెలివరీ ఏజెంట్లను మాటల్లో పెట్టి.. కాస్ట్ స్టిక్కర్లను ఛేంజ్ చేసేవాళ్లు. ఎక్కువ ధర ప్రొడెక్ట్ స్టిక్కర్లను తక్కువ ధర ప్రొడెక్టులకు మార్చేసే వాళ్లు. ఆ తర్వాత ఎలాగోలా చేసి ఎక్కువ ధర కలిగిన ప్రొడెక్టుల ఆర్డర్ ను క్యాన్సల్ చేసేవాళ్లు. అయితే వారు స్టిక్కర్లు మార్చిన విషయం తెలియక తక్కువ ధర కలిగిన ప్రొడెక్టులను రిటర్న్ తీసుకెళ్లిపోయేవారు. 

అమెజాన్ కు రూ.కోటికి పైగా కన్నం

ఈ విషయాన్ని ఎవరూ గుర్తించకపోవడంతో ఈ ఇద్దరు కేటుగాళ్లు ఎక్కువ ధర కలిగిన వస్తువులను బయట తక్కువ ధరకు అమ్ముకుని డబ్బులు పోగుచేసుకునేవాళ్లు. ఇందులో భాగంగానే ఒక రాష్ట్రంలో దొరికిపోతే వేరొక రాష్ట్రానికి మకాం మర్చేవాళ్లు. ఇలా దాదాపు 8 రాష్ట్రాల్లో ఈ దందా జరిపారు. ఆఖరికి అమెజాన్ డెలివరీ ఏజెంట్ ఈ విషయాన్ని పసిగట్టడంతో రాజ్ కుమార్, సుభాష్ పోలీసులకు చిక్కారు.

Also Read :  అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

అయితే ఇప్పటి వరకు వారు చేసిన ఈ దందాలో అమెజాన్ కు దాదాపు రూ.కోటికి పైగా దెబ్బేసినట్లు తెలుస్తోంది. కాగా ఇలాంటి దొంగతనమే గతంలో ఓ సినిమా వచ్చింది. మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన 'కనులు కనులను దోచాయంటే' సినిమాలో కూడా ఈ సంఘటనలాంటి సీనే కనిపిస్తుంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pakistan: పాక్ పౌరులు ఇండియాలోనే ఉంటే 3 ఏళ్లు జైలుశిక్ష..

భారత్‌లో ఉన్న పాకిస్థానీయులు నిర్ణీత గడువులోగా వెళ్లకపోతే వాళ్లని ప్రకారం వాళ్లని అరెస్టు చేయవచ్చు. దీనిపై దర్యాప్తు చేపట్టి.. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా, లేదా రెండు విధించే ఛాన్స్ కూడా ఉంటుంది.

New Update
Pakistani Nationals Failing To Leave India Face 3 Years Jail Term

Pakistani Nationals Failing To Leave India Face 3 Years Jail Term

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌లో ఉంటున్న పాకిస్థానీయులను నిర్ణీత గడువులోగా వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటినా కూడా ఇంకా భారత్‌లోనే ఉంటే చట్టం ప్రకారం వాళ్లని అరెస్టు చేయవచ్చు. దీనిపై దర్యాప్తు చేపట్టి.. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా, లేదా రెండు విధించే ఛాన్స్ కూడా ఉంటుంది.  

Also Read: బ్యాగ్‌లో బాంబ్- విమానంలో ‘అల్లా హు అక్బర్’ అంటూ భయపెట్టిన వ్యక్తి!

సార్క్‌ వీసాల కింద ఇండియాలో ఉంటున్న పాకిస్థానయులు ఏప్రిల్ 26లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మెడికల్ వీసాల కింద వచ్చినవాళ్లకు మాత్రం ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చింది. స్టూడెంట్, బిజినెస్, విజిటర్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవాళ్లు మాత్రం ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఏప్రిల్ 4 నుంచి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్‌ యాక్ట్‌-2025 అమల్లోకి వచ్చింది. 

Also Read: 'ఇలా చేయడం కరెక్ట్‌ కాదు'.. కేంద్రాన్ని హెచ్చరించిన జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం..

దీనిప్రకారం గడువు అయిపోయినా కూడా భారత్‌లో ఉంటే.. వీసా రూల్స్‌ను ఉల్లంఘించడం, నిషేధిత ప్రాంతాలకు వెళ్లడం లాంటి సందర్భాల్లో మూడేళ్ల వరకు జైలుశిక్ష, అలాగే రూ.3 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. మరోవైపు పాకిస్థానీయులను గుర్తించి వాళ్లని వెనక్కి పంపించే దిశగా ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే.. పాకిస్థాన్‌ జాతీయులు అటారీ-వాఘా బార్డర్‌ గుండా తరలివెళ్లారు. 3 రోజుల్లోనే ఈ సరిహద్దు గుండా దేశం దాటి వెళ్లిపోయారు. ఇక పాకిస్థాన్‌లో ఉన్న 745 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు.          

Also Read: పహల్గాం దాడిని పూర్తిగా షూట్‌ చేసిన వీడియోగ్రాఫర్‌.. కానీ

 telugu-news | rtv-news | Pahalgam attack | pakistan | national-news

Advertisment
Advertisment
Advertisment