Terrorists: జమ్మూ కాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఆదివారం జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. చత్రూ అడవిలో నక్కిన ఉగ్రవాదులను తుదముట్టించేందుకు ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, CRPF జాయింట్‌గా చేసిన ఆపరేషన్ ట్రాషి-I సక్సెస్ అయ్యింది.

New Update
BREAKING

BREAKING

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఆదివారం జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌(encounter) లో ఇద్దరు పాకిస్థానీ ఉగ్రవాదులు హతమయ్యారు. చత్రూ అడవిలో నక్కిన ఉగ్రవాదులను తుదముట్టించేందుకు ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, CRPF జాయింట్‌గా చేసిన 'ఆపరేషన్ ట్రాషి-I'(Operation Trashi-I) సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. శాంతి భద్రతల దృష్ట్యా పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసి, నిఘా పెంచారు. - (jammu kashmir terror attack)

Also Read :  ఆఫ్ఘనిస్తాన్‌పై పాక్ వైమానిక దాడులు.. పదుల సంఖ్యలో పౌరుల మృతి

ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు కిష్త్వార్‌లోని చత్రూ బెల్ట్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు బలగాలకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన సైన్యం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో భద్రతా బలగాలు గాలింపు చేపడుతుండగా, ఒక మట్టి ఇల్లులో నక్కిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు.

Also Read :  విజయ్ దళపతి సంచలన నిర్ణయం.. ఎన్నికల్లో పోటీ అక్కడి నుంచే!

మోస్ట్ వాంటెడ్ కమాండర్ హతం?

ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు(terrorists) అక్కడికక్కడే మరణించారు. వీరిలో ఒకరు జైషే మహమ్మద్ సంస్థకు చెందిన మోస్ట్ వాంటెడ్ కమాండర్ సైఫుల్లా అయి ఉండవచ్చని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. సైఫుల్లా గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో భద్రతా బలగాలపై దాడులకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఘటనా స్థలం నుండి రెండు AK-47 రైఫిల్స్, భారీగా పేలుడు పదార్థాలు, యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

కిష్త్వార్ అటవీ ప్రాంతంలో గత కొన్ని వారాలుగా ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి 18న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక పారా కమాండో వీరమరణం పొందగా, ఎనిమిది మంది సైనికులు గాయపడ్డారు. నాటి నుండి కొనసాగుతున్న 'ఆపరేషన్ ట్రాషి-I' లో భాగంగా, మంచు కురుస్తున్నప్పటికీ, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో బలగాలు తమ గాలింపును ముమ్మరం చేశాయి. తాజా విజయంతో స్థానికంగా ఉగ్రవాద నెట్‌వర్క్‌కు గట్టి దెబ్బ తగిలినట్లయింది.

Advertisment
తాజా కథనాలు