Chhattisgarh Encounter : భారీ ఎన్ కౌంటర్.. 31 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో  భారీ ఎన్ కౌంటర్ జరిగింది.  నేషనల్ పార్క్ వద్ద జరిగిన  ఈ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు ఆదివారం ఉదయం తెలిపారు. భద్రతా దళాలు, మావోయిస్టులు మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.  

author-image
By Krishna
New Update
encounter

Encounter Photograph: (Encounter)

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) లోని బీజాపూర్ జిల్లాలో  భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇంద్రావతి నేషనల్ పార్క్ వద్ద భద్రతా దళాలు, మావోయిస్టు (Maoists) ల మధ్య హోరాహోరీగా జరిగిన  కాల్పులులో 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు 2025 ఫిబ్రవరి 09వ తేదీ  ఆదివారం ఉదయం తెలిపారు. ఇప్పటివరకు 31 మృతదేహాలను వెలికితీశారు. చంపబడిన నక్సలైట్ల సంఖ్య పెరగవచ్చు. ఘటనా స్థలం నుండి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే కొంతమంది సైనికులు గాయపడ్డారని కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  భద్రతా దళాలు, మావోయిస్టులు మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. నక్సలైట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.  

Also Read :  థైరాయిడ్ టాబ్లెట్స్‌ వేసుకున్నాక ఎన్ని గంటలు ఏమీ తినకూడదు?

Also Read :  వీడు కొడుకేనా.. అడిగింది ఇవ్వలేదని తండ్రి పీకను రంపంతో కోసి..

48 మంది మావోయిస్టులు మృతి

భద్రతా దళాలు, మావోయిస్టులు మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. నక్సలైట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.  కాగా ఇటీవల ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్‌ జిల్లా కుల్హాడీఘాట్‌ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది . ఆ ఘటనలో 20 మంది పైగా మావోయిస్టులు మృతిచెందిన సంగతి తెలిసిందే.

ఇక 2026 మార్చి 31 నాటికి దేశం నుండి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవలి కాలంలో ఛత్తీస్‌గఢ్‌లో డజన్ల కొద్దీ నక్సలైట్లు హతమయ్యారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు 48 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2024లో మరణించిన మావోయిస్టుల సంఖ్య 290గా ఉంది

Also Read :  సీఎం పదవికి అతిశీ రాజీనామా

Also Read :  మెక్సికోలో విషాదం.. బస్సు-ట్రక్కు ఢీ.. 41 మంది సజీవ దహనం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు