/rtv/media/media_files/2026/05/05/tvk-vijay-unanimously-elected-as-legislative-party-leader-2026-05-05-15-46-59.jpg)
TVK Vijay unanimously elected as legislative party leader
తమిళనాడు అసెంబ్లీ ఎన్నిక(Tamilnadu Assembly Election Results) ల్లో టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించడంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలోనే చెన్నైలోని పనైయూర్ పార్టీ కార్యాలయంలో మంగళవారం కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన టీవీకే ఎమ్మెల్యేలు విజయ్‌ను తమ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే మరో 10 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కావాలి. దీంతో ఇతర పార్టీల మద్దతుతో విజయ్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ సాధించే దిశగా అడుగులు వేస్తోంది.
Also Read: ఓడిన సీఎంలకు మరో ఛాన్స్.. మమతా, స్టాలిన్ మళ్లీ ఎన్నికల్లో పోటీ !
TVK Vijay Unanimously Elected
అయితే టీవీకేతో ఏ పార్టీలు మద్దతిస్తాయో అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. కాంగ్రెస్, లెఫ్ట్, PMK పార్టీలు సపోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇది జరిగితే త్వరలోనే విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు విజయ్.. ప్రభుత్వ ఏర్పాటు కోసం రెండు వారాల్లో మెజార్టీ నిరూపించుకుంటామని గవర్నర్‌కు లేఖ రాశారు. అలాగే గవర్నర్‌తో దీనిపై చర్చలు జరిపేందుకు ఆయన అపాయింట్‌మెంట్ కూడా కోరినట్లు తెలుస్తోంది. మొత్తానికి మరో రెండు వారాల్లో విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసే ఛాన్స్ ఉంది.
Also Read: సినిమా రంగం నుంచి పెళ్లి వరకు.. త్రిష, జయలలిత మధ్య ఉన్న 6 పోలికలు ఏంటో తెలుసా?
ఇదిలాఉండగా ఈ ఎన్నికల్లో విజయ్ పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నుంచి రెండు స్థానాల్లో పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. చట్టం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి ఒకే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాలి. దీంతో విజయ్ ఓ స్థానానికి రాజీనామా చేయాల్సి వస్తుంది. అయితే ఆయన తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసి.. పెరంబూర్ ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Follow Us