/rtv/media/media_files/2026/05/05/pm-modi-and-tvk-vijay-2026-05-05-18-55-52.jpg)
PM Modi and TVK Vijay
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన టీవీకే పార్టీకి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. తమిళనాడు పురోగతికి కోసం కేంద్రం తన వంతు అండగా ఉంటుందని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా మోదీ చేసిన ట్వీట్‌కు తాజాగా విజయ్ కూడా ఎక్స్‌లో స్పందించారు. తమకు అభినందనలు తెలియజేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల సంక్షేమమే తమ ఏకైక లక్ష్యమన్న విజయ్.. రాష్ట్ర పురోగతికి, తమిళ ప్రజల శ్రేయస్సుకు కట్టుబడి ఉంటామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నామని రాసుకొచ్చారు.
Thank you, Hon'ble @PMOIndia, for your greetings. The well-being of our people remains our only goal.
— TVK Vijay (@TVKVijayHQ) May 5, 2026
Transcending politics, we shall focus on the State's progress and the welfare of people of Tamil Nadu. We look forward to the Union Government’s support in this endeavor. https://t.co/EO4h8qC0hF
ఇదిలాఉండగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలిచి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. విజయ్ కూడా పోటీ చేసిన రెండు స్థానాల్లో భారీ మెజార్టీతో గెలిచారు. కానీ మ్యాజిగ్ ఫిగర్ 118కి దూరమయ్యారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ మరో 10 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు DMK కూటమి 73 స్థానాల్లో గెలవగా.. AIADMK కూటమికి 53 స్థానాలకు పరిమితమయ్యింది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే.. మరికొన్ని రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆయన గవర్నర్‌కు లేఖ రాశారు. మరో రెండో వారాల్లో మెజార్టీ నిరూపించుకుంటానని పేర్కొన్నారు.
Follow Us