/rtv/media/media_files/2026/05/05/tvk-chief-vijay-requested-congress-support-to-form-tamilnadu-govt-2026-05-05-21-52-38.jpg)
TVK chief Vijay requested Congress support to form Tamilnadu govt
తమిళనాడులో టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే. మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు ఉండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ పార్టీకి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ఈ క్రమంలోనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే చీఫ్ విజయ్ కాంగ్రెస్ సపోర్ట్ కోరినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్ వెల్లడించారు. రాష్ట్ర కాంగ్రెస్ శాఖ బుధవారం దీనిపై చెన్నైలో సమావేశమై నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.
Also Read: మీ సపోర్ట్ కావాలి మోదీజీ.. విజయ్ సంచలన ట్వీట్!
తమిళనాడులో కాంగ్రెస్‌కు అయిదు స్థానాల్లో గెలిచింది. అయితే టీవీకే పార్టీకి 10 ఎంది ఎమ్మెల్యేల బలం కావాలి. ఒకవేళ కాంగ్రెస్ మద్దతిచ్చినా మరో అయిదు మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కావాలి. పీఎంకే పార్టీ నాలుగు స్థానాల్లో గెలిచింది. ఇక సీపీఐ, సీపీఎం, వీసీకే చెరో రెండు స్థానాల్లో గెలిచాయి. దీంతో ఈ పార్టీల్లోని పలువురు ఎమ్మెల్యేలు విజయ్‌కు సపోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది.
Follow Us