/rtv/media/media_files/2026/05/04/tvk-chief-vijay-2026-05-04-21-50-28.jpg)
TVK Chief Vijay
తమిళనాడు ఎన్నికల్లో టీవీకే చీఫ్ విజయం ప్రభంజనం సృష్టించారు. ఇప్పటికే టీవీకే 105 స్థానాల్లో విజయం సాధించగా మరో రెండు స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్, లెఫ్ట్, PMK పార్టీలతో కలిసి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో దీనిపై స్పష్టత రానుంది. ఎవరూ ఉహించని విధంగా విజయ్ ఎన్నికల్లో విజయభేరి మోగించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే విజయ్ ఎన్నికల నామినేషన్ సందర్భంగా తనకు రూ.603.20 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు.
Also Read: అస్సాం, బెంగాల్, పుదుచ్చేరిలో బీజేపీ గెలుపు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
BMW i7, టయోటా లెక్సస్, టయోటా వెల్ఫైర్ లాంటి లగ్జరీ కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక చెన్నైలో విజయ్ ఇంటి విలువ రూ.70-80 కోట్ల దాకా ఉంటుంది. అలాగే తమిళనాడులోని పలు ప్రాంతాల్లో 10 రెసిడెన్షియల్ ప్రాపర్టీలు కూడా ఉన్నాయి. 2024-25లో తనకు రూ.184 కోట్ల ఆదాయం వచ్చిందని అయితే ఎలాంటి అప్పులు లేవని స్పష్టం చేశారు.
Also Read: ఆటో డ్రైవర్ To అసెంబ్లీ.. ఇది మామా విక్టరీ అంటే..!
Follow Us