/rtv/media/media_files/2026/03/29/tvk-announces-candidates-for-tamil-nadu-polls-2026-03-29-14-54-38.jpg)
TVK Announces Candidates For Tamil Nadu Polls
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ తమ అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది. పార్టీ చీఫ్ విజయ్ రెండు స్థానాల్లో పోటీ చేయనున్నారు. పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. ఆదివారం చెన్నైలో జరిగిన సభలో విజయ్ ఈ లిస్టును రిలీజ్ చేశారు. తమ పార్టీ నుంచి పోటీ చేయనున్న అభ్యర్థులను ప్రజల రక్షకులని అన్నారు.
Also Read: రైతుకు జాక్‌పాట్.. రూ.15 కోట్ల పరిహారం.. హెలికాప్టర్‌నే కొనేశాడుగా
వీళ్లు రాజకీయ దిగ్గజాలు కాదని.. ప్రజలకు జవాబుదారీగా ఉంటారని చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, టీవీకే మధ్య గట్టి పోటీ ఉంటుందని తెలిపారు. విజిల్ గుర్తు అందరూ ఓటు వేయాలని కోరారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయమని.. అవినీతికి పాల్పడమన్నారు. మహిళలకు భద్రత కల్పి్స్తామన్నారు. అలాగే డ్రగ్స్‌రహిత రాష్ట్రంలో తమిళనాడును మారుస్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేయమని హామీ ఇచ్చారు. రాష్ట్ర శ్రేయస్సు తమ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు.
Also Read: మిడిల్ ఈస్ట్ టెన్షన్: రంగంలోకి దిగిన మోదీ..సౌదీ ప్రిన్స్‌తో ఫోన్ కాల్
మరోవైపు అధికార పార్టీ డీఎంకే కూడా తమ అభ్యర్థుల తొలి జాబితాను శనివారం విడుదల చేసింది. మొత్తం 234 స్థానాలకు గాను 164 స్థానాల నుంచి పోటీ చేయనుంది. మిగతా 70 స్థానాలు మిత్రపక్ష పార్టీలకు కేటాయించింది. ఇందులో కాంగ్రెస్ 28 స్థానాల్లో పోటీ చేయనుంది. DMDK 10, VCK 8, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెరో 5 స్థానాల నుంచి పోటీ చేయనున్నాయి. AIDMKకు 4, మిగతా స్థానాలు ఇతర చిన్న పార్టీలకు కేటాయించారు. ఇక తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనుండగా.. మే 4న ఓట్ల లెక్కింపు ఉండనుంది.
Follow Us