/rtv/media/media_files/2025/03/18/qufLxhVHH5a23zrrznhw.jpg)
tulsi
భారత్‌కు వస్తే తనకు ఇంట్లో ఉన్నట్లే ఉంటుందని అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ అన్నారు.రెండున్నర రోజుల పర్యటన నిమిత్తం ఇండియాకు వచ్చిన ఆమె ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
Also Read:Horoscope Today: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!
భారతీయ సంస్కృతి, వంటకాలు, ఆధ్యాత్మిక పట్ల తనకున్న అభిమానం గురించి ఆమె తెలిపారు.తన జీవితం పై పెను ప్రభావం చూపిన భగవద్గీత గురించి మాట్లాడారు. నాకు భారత్ అంటే ఎంతో ఇష్టం . ఇక్కడ ఉంటే ఇంట్లో ఉన్నట్లే భావిస్తాను. ఇక్కడి ప్రజలు ఎంతో దయగలవారు.
Also Read: Trump-Biden: బైడెన్ చేసిన క్షమాభిక్షలు చెల్లవు అంటున్న ట్రంప్!
ఎంతో స్వాగతిస్తారు. ఇక్కడి ఆహారం ఎంతో రుచిగా ఉంటుంది. దాల్ మఖానీ,తాజా పన్నీర్ నా ఫేవరేట్ అని తులసీ చెప్పుకొచ్చారు.కృష్ణుడి బోధనలు తన దైనందిన జీవితంలో బలాన్ని, శాంతిని ఎలా పెంచుతాయో ఆమె పంచుకున్నారు.
నా వ్యక్తిగత ఆధ్యాత్మిక సాధన,దేవుడితో అనుసంధానం నా జీవితంలో కేంద్రంగా ఉన్నాయి.ప్రతిరోజూ దేవుడికి ఇష్టమైన విధంగా జీవించడానికి ,ప్రజలకు సేవలు అందించడానికి నా వంతు ప్రయత్నం చేసత్ఆను.యుద్ద సమయంలో పని చేసినా..ప్రస్తుతం క్లిష్ట సమయంలో సవాళ్లు ఎదుర్కొంటున్నా ఇలా వేర్వేరు సందర్భాల్లో ఎప్పుడు కష్టాలు చుట్టుముట్టినా అర్జునుడికి కృష్ణుడుబోధించిన పాఠాలను వింటాను.
ఇవే నాలో బలాన్ని,శాంతిని పెంచుతాయని తులసీ చెప్పుకొచ్చారు. యూఎస్‌ఆర్మీలో తులసీగబ్బార్డ్ రెండు దశాబ్దాలకు పైగాపని చేశారు.ఆమె 2012లో హౌస్ ఆఫ్ రిప్పంజెంటేటివ్స్ కు ఎన్నికయ్యారు. ఆమె భగవద్డీత సాక్షిగా ప్రమాణం చేసి సభలో అడుగుపెట్టారు. తులసీ గబ్బార్డ్ తల్లి కరోల్ పోర్టర్ హిందూ మతం స్వీకరంచడంతో తన పిల్లలకు హిందూ పేర్లు పెట్టారు.
ఇక తులసీ తన పెళ్లిని హిందూ సంప్రదాయ పద్దతిలో వేద మంత్రాల సాక్షిగా చేసుకున్నారు.
Also Read: Sunita Williams: సునీతా విలియమ్స్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఇదే.. ఆమె భారతీయ మూలాలు ఎక్కడంటే?