/rtv/media/media_files/2026/04/16/transco-2026-04-16-08-42-33.jpg)
Transco Warns Striking Artisans with Dismissal as TESMA Comes into Force
తెలంగాణలో సమ్మె చేస్తున్న విద్యుత్ ఆర్టిజన్లకు ట్రాన్స్‌కో(ts-transco) యంత్రాంగం హెచ్చరించింది. గురువారం ఉదయం 11 గంటలలోగా విధుల్లో చేరాలని ఆదేశించింది. ఒకవేళ చేరకుంటే వాళ్లని ఉద్యోగాల నుండి తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు దీనిపై బుధవారం కీలక ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా అత్యవసర సేవల కిందకు వస్తుందని.. ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మె చేయడం రూల్స్‌కు విరుద్ధమని ట్రాన్స్‌కో స్పష్టం చేసింది.
Also Read: సూర్యాపేటలో ఘోర ప్రమాదం.. కాంగ్రెస్ నేత మృతి
Transco Warns Striking Artisans
ముఖ్యంగా తెలంగాణ నిత్యావసర సేవల నిర్వహణ చట్టం (టెస్మా) కింద విద్యుత్ రంగాన్ని చేర్చినట్లు ట్రాన్స్‌కో వెల్లడించింది. ఈ చట్టం ప్రస్తుతం అమల్లో ఉంది. అందుకే విద్యుత్ సంస్థల్లో సమ్మెలు చేయడం చట్టవిరుద్ధమని తెలిపింది. ఇప్పటికీ విధులకు దూరంగా ఉన్న తాత్కాలిక ఉద్యోగులు (ఆర్టిజన్లు) ప్రభుత్వం విధించిన గడువులోగా హాజరుకావాలని సూచించింది. లేకపోతే డిస్మిస్ చేస్తామంటూ హెచ్చరించింది.
Also Read: డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం స్పష్టత..జనాభా ప్రాతిపదిక ఒక్కటే కాదు...
తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్లు తమ ఉద్యోగ భద్రత, సర్వీసు నిబంధనల కోసం ఏప్రిల్ 8 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే పాత APSEB సర్వీస్ నిబంధనలు తమకు కూడా వర్తింపజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ విద్యార్హతల ఆధారంగా తగిన కేడర్లలోకి రెగ్యులర్ చేయాలని కోరుతున్నారు. 2017లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తున్నారు. 2026 వేతన సవరణను అమలు చేయాలంటున్నారు. అలాగే పీస్-రేట్ కార్మికులకు జీవో నెం.11 ప్రకారం కనీస వేతనాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
Follow Us