Watch Video: డ్యాన్స్ చేయ్ లేదంటే సస్పెండ్ చేస్తా.. పోలీసుకు ఆర్జేడీ నేత వార్నింగ్

బీహార్‌లో ఆర్జేడీ నేత తేజ్‌ ప్రతాప్‌ సింగ్ యాదవ్‌ తన ఇంట్లో హోలీ జరుపుకున్నారు. తన ఇంటికి బందోబస్తు కోసం వచ్చిన ఓ పోలీసును బలవంతంగా డ్యాన్స్ చేయించాడు. చేయకుంటే ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.

New Update
Tej Pratap's order to cop on Holi sparks row

Tej Pratap's order to cop on Holi sparks row

బీహార్‌లో ఆర్జేడీ నేత తేజ్‌ ప్రతాప్‌ సింగ్ యాదవ్‌ ఇంట్లో ఆసక్తికర ఘటన జరిగింది. ఆయన ఇంట్లో హోలీ సంబురాలు జరుగుతుండగా ఓ పోలీస్ అధికారి బందోబస్తు కోసం వచ్చారు. దీంతో తేజ్‌ ప్రతాప్‌.. యూనిఫాంలో ఉన్న ఆ పోలీసును డ్యాన్స్ చేయాలన్నారు. పాట ప్లే కాగానే డ్యాన్స్‌ చేయాలని.. లేకపోతే ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆ పోలీస్ అధికారి ఇబ్బంది పడుతూ రెండు స్టెప్పులు వేశారు. 

Also Read: శిశువును మంటలపై తలకిందులుగా వేలాడదీసిన భూతవైద్యుడు.. చివరికీ

ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజెన్లు ఆర్జేడీ నేత ప్రతాప్ సింగ్ యాదవ్‌పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కూడా మాట్లాడారు. '' తండ్రి లాగే కొడుకు ఉన్నారు. ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా సీఎంగా ఉన్నప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు కొడుకుకి అధికారం లేకపోయినా కూడా బెదిరింపులు పాల్పడి, ఒత్తిడి చేసి చట్టాలను కాపాడేవాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. డ్యాన్స్ చేయకపోతే ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేస్తానని చెప్పడం చాలా దారుణమని అన్నారు. 

Also Read: ఓలా, ఉబర్ డ్రైవర్ల ముసుగులో...బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాలో వెలుగులోకి సంచలన విషయాలు...

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

New Update
Agniveers

Agniveers

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఆదివారం నాయబ్ సింగ్‌ నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

'' హర్యానా నుంచి 2022-23లో 2,227 మంది, 2023-24లో 2893 మంది ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో చేరారు. త్రివిధ దళాల్లో తమ సర్వీసులు పూర్తి చేసుకున్న అగ్నివీరుల భవిష్యత్తు కాపాడేందుకు మా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా హర్యానా నిలిచిందని'' నాయబ్ సింగ్ సైనీ అన్నారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా హర్యానాలో చేపట్టే కానిస్టేబుళ్లు, ఫారెస్టు గార్డు, జైల్‌ వార్డెన్ల నియామకాల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఈ మేరకు హర్యానా అగ్నివీర్ పాలసీ 2024ను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా అగ్నివీరులకు పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. వీటితో పాటు స్వయం ఉపాధిని ఎంచుకునే వాళ్లకి కూడా అవసరమైన సబ్సిడీలు అందిస్తామని పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

Also Read: అమెరికాలో అగ్నిప్రమాదం...పది మంది తెలుగు విద్యార్థులు..

 telugu-news | rtv-news | haryana | agniveer | agniveer-jobs

Advertisment
Advertisment
Advertisment